Sunishith: నా భార్య ని వరుణ్ తేజ్ ఎలా పెళ్లి చేసుకుంటాడు! తన మీద పోలీస్ కేసు ఫైల్ చేస్తాను:సునిశిత్

Posted by venditeravaartha, June 1, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

కరోనా సమయం లో థియేటర్ లు బంద్ కావడం తో అందరు సోషల్ మీడియా మీద ఫోకస్ చేయడం అందులో రీల్స్ ,షార్ట్ ఫిలిమ్స్ ,కవర్ సాంగ్స్ ల తో కొంత మంది ఫేమస్ అయ్యారు..
మరి కొందరు కాంట్రవర్సీ ఇంటర్వ్యూ లు తో ఫేమస్ అయ్యారు.టాలెంట్ ఉన్న వాళ్ళు సినిమా ల లో ఛాన్స్ ల తో సెటల్ అయ్యారు.మరి కొందరు సోషల్ మీడియా ల లో లేని పోనీ వ్యాఖ్యల తో ఫేమస్ అవ్వాలని చూస్తున్నారు అందులో ఒకరు సునిశిత్(Sunishith).తన కి వచ్చిన సినిమా అవకాశాలను పవన్ కళ్యాణ్ ,మహేష్ బాబు ,జూనియర్ ఎన్టీఆర్ ,అల్లు అర్జున్ లు తీసుకుని తనకి అన్యాయం చేసారు అని ఈ మధ్య సోషల్ మీడియా ల హల్చల్ చేసాడు సునిశిత్.

sunishit

ఇక అంతటి తో ఆగకుండా హీరో లు తన ఫ్రెండ్స్ అని వారితో పబ్ ల కి వెళ్లి డ్రింక్ చేస్తాను అని చెప్పాడు.ఇంకో అడుగు ముందుకి వేసి హీరోయిన్ ల తో తనకి ఎఫ్ఫైర్ లు ఉన్నాయి అని కొంత మంది హీరోయిన్ ల తో డేటింగ్ కూడా చేశాను అని చెప్పుకుని వచ్చాడు.అందాల రాక్షసి సినిమా సమయం లో హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya) తో తనకి లవ్ అయింది అని కొద్దీ రోజులు డేటింగ్ చేసిన తర్వాత పెళ్లి చేసుకున్నాము అని చెప్పి అందరిని షాక్ కి గురి చేసాడు.ఈ విషయం లో లావణ్య రెస్పాండ్ అయ్యి సునిశిత్ మీద పోలీస్ కేసు కూడా ఫైల్ చేసింది,ఇక రామ్ చరణ్ భార్య ఉపాసన మీద కొన్ని అభ్యంతర వ్యాఖ్యలు చేయడం తో రామ్ చరణ్ ఫ్యాన్స్ చేత దెబ్బలు తిన్నాడు.ఇంకా అంతటి తో ఆగకుండా జూనియర్ ఎన్టీఆర్ మీద వ్యాఖ్యలు చేసి వాళ్ళ ఫ్యాన్స్ దగ్గర కూడా దెబ్బలు తిన్నాడు.

varun lavanya

రాంగోపాల్ వర్మ ని ఎంత కొట్టిన చావని పాము రా అన్నట్లు అదే విధంగా ఎంత మంది కొట్టిన నేను మారాను నేను ఇంతే అన్నట్లు ఉంది సునిశిత్ వాదన.రీసెంట్ గా వరుణ్ తేజ్(Varun tej) ,లావణ్య ల పెళ్లి కంఫర్మ్ అయినట్లు వార్తలు వచ్చాయి.జూన్ 9 నా వారి నిచ్చితార్ధం కూడా జరగనునట్లు సమాచారం.ఈ విషయం గురించి సునిశిత్ మాట్లాడుతూ ఇది వరకే నాకు లావణ్య త్రిపాఠి కి పెళ్లి జరిగింది.ఆ తర్వాత కొన్ని కారణాల వలన మేము విడిపోయాము.అయినా కూడా నాకు లావణ్య మీద ప్రేమ ఉంది.ఇప్పుడు వరుణ్ తేజ్ ఎలా తనని పెళ్లి చేసుకుంటాడు.నేను వరుణ్ మీద పోలీస్ కేసు పెడతాను అని కామెంట్ చేసాడు.మరి ఇప్పుడు మెగా ఫ్యాన్స్ సునిశిత్ ని ఎలా కొడతారో చూడాలి.

lavanya varun

2653 views