Drishyam : సత్తా చాటిన ‘దృశ్యం’.. హాలీవుడ్ లో రీమేక్ కానున్న తొలి తెలుగు చిత్రం

Posted by venditeravaartha, March 1, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Drishyam : మన దేశంలో విడుదలైన దృశ్యం సిరీస్ సినిమాలు అన్ని భాషల్లోనూ ఘనవిజయం సాధించాయి. మలయాళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. అయితే ఇప్పుడు ఈ సినిమాను హాలీవుడ్‌లో రీమేక్ చేయనున్నారు. ఈ మేరకు ఓ హాలీవుడ్ నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో రీమేక్ చేయనున్నట్టు వెల్లడించారు. దీంతో హాలీవుడ్‌లో రీమేక్‌ కానున్న తొలి భారతీయ చిత్రంగా ‘దృశ్యం’ రికార్డు సృష్టించనుంది.

ఈ సినిమా మొదట మలయాళంలో విడుదలైంది. అక్కడ ఘన విజయం సాధించడంతో హిందీలో దృశ్యం, కన్నడలో దశ, తమిళంలో పాపనాసం, తెలుగులో దృశ్యం పేరుతో రీమేక్ చేసి విడుదల చేశారు. దాని సీక్వెల్ దృశ్యం 2 కూడా విజయవంతమైంది. ఈ సిరీస్ సినిమాలు మొదట కొరియన్‌లో రీమేక్ చేయబడ్డాయి. అవి అక్కడ ఘనవిజయం సాధించాయి.

ఇన్ని విజయాల కారణంగా ఇప్పుడు హాలీవుడ్ నిర్మాతల దృష్టి దృశ్యం సినిమాపై పడింది. హాలీవుడ్‌లో ప్రసిద్ధి చెందిన గల్ఫ్‌స్ట్రీమ్ పిక్చర్స్, మరో నిర్మాణ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో రీమేక్ చేయనున్నారు. భారతీయ చలనచిత్ర నిర్మాణ సంస్థ పనోరమా స్టూడియోస్ నుండి ఈ చిత్రాల అంతర్జాతీయ రీమేక్ హక్కులను కంపెనీ కొనుగోలు చేసింది.

467 views