Heroine Rambha: రేస్ గుర్రం నటుడితో హీరోయిన్ రంభ సరసాలు..ఇది నిజంగా ఎవ్వరూ ఊహించనిది!

Posted by venditeravaartha, September 21, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

హీరోయిన్ రంభ గురించి సినీ ప్రియులకు పరిచయం అక్కర్లేదు. అప్పట్లో రంభ సినిమా వచ్చిందంటే చాలు.. కుర్రకారు నుండి ముసలోళ్ల వరకు ప్రతి ఒక్కరు థియేటర్లకు పరిగెత్తుకెళ్లి ఎగబడి మరీ సినిమా చూసేవాళ్లట. ప్రస్తుతం శ్రీలీలకు ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందో అప్పట్లో రంభకు అంతకు పదింతలు అభిమానులు ఉన్నారట. హీరోయిన్ రంభ కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, హిందీ, భోజ్ పురి వంటి చాలా భాషల్లో హీరోయిన్ గా నటించి సూపర్ సక్సెస్ అయింది. ఇక ఆమె అందానికి అప్పట్లో స్టార్ హీరోలు సైతం బానిసలయ్యారట. సినిమా ఇండస్ట్రీలో కొన్ని దశాబ్ధాల పాటు కెరీర్ ను కొనసాగించిన హీరోయిన్లలో రంభ ఒకరు. కెరీర్ పీక్ స్టేజీలో ఉండగానే ఉన్నట్లుండి సినిమాలకు గుడ్ బై చెప్పి ఇండస్ట్రీకి దూరమైంది.

హీరోయిన్ దివ్యభారతి చనిపోవడంతో సరిగ్గా ఆమె పోలికతో ఉండడంతో తొలిముద్దు సినిమాలో రంభను తీసుకున్నారు. ఈ సినిమాతోనే ఆమె తొలిసారి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. కానీ అఫీషియల్ ఎంట్రీ మాత్రం రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన ఆ ఒక్కటి అడక్కు సినిమాతో. ఈ సినిమా తర్వాత దాదాపు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల అందరి సరసన నటించి స్టార్ స్టేటస్ అందుకుంది. ఇకపోతే గతంలో రంభ గతంలో ‘రేసుగుర్రం’ సినిమా విలన్, భోజ్‌పురి స్టార్ హీరో రవి కిషన్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిందంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. వీరిద్దరూ కలిసి పలు సినిమాల్లో నటించారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారిందట. ఒకానొక సమయంలో రవికిషన్, రంభ ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట. కానీ అప్పటికే రవికిషన్‌కు పెళ్లై.. ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. వీరి బాగోతం రవికిషన్ అన్నయ్యకు తెలియడంతో రంభకు దూరంగా ఉండాలని బ్రెయిన్ వాష్ చేశాడట. అంతటితో ఆగకుండా భోజ్‌పురిలో తనకు అవకాశాకలు రాకుండా ఇండస్ట్రీ నుంచి పర్మినెంట్‌గా రాకుండా చేశాడట. దీంతో ఆ హీరోపై ఉన్న ప్రేమతో సూసైడ్ చేసుకొని చనిపోవాలని కూడా అనుకుందట రంభ.

ఈ రూమర్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఓ ఇంటర్వ్యూలో రంభ ఈ విషయం పై క్లారిటీ ఇచ్చింది. కావాలనే ఇద్దరు హీరోయిన్లు తనపై దుష్ప్రచారం చేశారంటూ చెప్పుకొచ్చింది. రవి కిషన్ నాకు అన్నయ్య. ఆయనను నేను ఎప్పుడూ అన్నయ్యలాగే ట్రీట్ చేశాను. కానీ నా ఎదుగుదలని ఓర్వలేని ఆ ఇద్దరి హీరోయిన్లే ఇలా రూమర్స్ సృష్టించారు. ఇప్పటివరకు మళ్లీ ఆ హీరోయిన్లతో నేను మాట్లాడలేదని తెలిపింది. కాగా అప్పట్లో రంభ పై ఈ రూమర్స్ స్ప్రెడ్ చేసింది హీరోయిన్ నగ్మా అని ప్రచారం జరిగింది. ఎందుకంటే నగ్మా ఒకప్పుడు రవి కిషన్ ప్రియురాలని ప్రచారం జరిగింది. రవికిషన్ తో రంభ సాన్నిహిత్యం చూడలేకే నగ్మా ఇలాంటి వార్తలు పుట్టించిందని వార్తలు వచ్చాయి. రంభ ప్రస్తుతం కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రకుమార్‌ను పెళ్లి చేసుకుంది. వారికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.

301 views