Aarthi Agarwal: షాకింగ్..ఆర్తి అగర్వాల్ కి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా..? చూస్తే ఆశ్చర్యపోతారు!

Posted by venditeravaartha, May 28, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Aarthi Agarwal : ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదగడం అనేది సాధారణమైన విషయం కాదు. అతి తక్కువ మంది హీరోయిన్స్ కి మాత్రమే ఇప్పటి వరకు ఆ అదృష్టం దక్కింది. ఆ తక్కువమందిలో ఒకరు ఆర్తి అగర్వాల్. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ అనే సినిమా ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన ఈ బ్యూటీ, మొదటి చిత్రం తోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకోవడంతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ సినిమా తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఈ చిత్రం తర్వాత ఆమె చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునలతో పాటుగా వెంకటేష్ తో మరో రెండు సినిమాలు చేసింది.

ఇక నేటి తరం స్టార్ హీరోలలో మహేష్ బాబు , ప్రభాస్, ఎన్టీఆర్ ఆర్తి అగర్వాల్ తో సినిమాలు చేసారు. అలా అతి తక్కువ సమయంలోనే సూపర్ స్టార్ రేంజ్ కి ఎదిగిపోయిన ఆర్తి అగర్వాల్ కెరీర్, ఆత్మహత్య యత్నంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ సంఘటన తర్వాత ఆమె కెరీర్ మొత్తం తారుమారు అయిపోయింది. సినిమా అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ఆ సమయం లో పెళ్లి చేసుకున్న ఆమె, మళ్ళీ కొన్నాళ్ళకు భర్తతో విడిపోయి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. రీ ఎంట్రీ తర్వాత కూడా ఆమెకి అవకాశాలు రాలేదు. బాగా లావుగా ఉండడంతో, బరువు తగ్గితే సినిమా అవకాశాలు వస్తాయేమో అనే ఆశతో లైపో సర్జరీ చేయించుకుంది. ఆ సర్జరీ వికటించడంతో ఆమె చనిపోయింది. ఈ ఘటన యావత్తు సినీ లోకాన్ని, ఆమె అభిమానులను శోకసంద్రం లోకి నెట్టేసింది.

ఇది ఇలా ఉండగా ఆర్తి అగర్వాల్ కి పెళ్లి జరిగి కొన్నాళ్ళు కాపురం చేసిన తర్వాత ఈమెకి సంతానం కలిగిందేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఎలాంటి సంతానం కలుగలేదు. కానీ ఒక అబ్బాయిని ఈమె దత్తత తీసుకొని, అతనిని బాగా చదివించేదని, ఆ అబ్బాయిని ఆర్తి అగర్వాల్ సొంత కొడుకులాగా చూసుకునేదని, ఆమె చనిపోయిన తర్వాత, ఆమె సోదరి అదితి అగర్వాల్ ఆ అబ్బాయి బాగోగులు చూసుకుంటుందని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. ఈ విషయం తెలుసుకొని ఆమె అభిమానులు ఎంతో గర్వంగా భావిస్తున్నారు. చనిపోయిన తర్వాత కూడా ఒక కుర్రాడి ఉన్నతికి ఆర్తి అగర్వాల్ ఉపయోగపడిందని, ఆమె గొప్ప మనసుకి ఇది ఒక నిదర్శనం అంటూ సోషల్ మీడియా లో పోస్టులు వేస్తున్నారు.

490 views