Tarun:పెళ్లి కాకముందే తండ్రి కాబోతున్న హీరో తరుణ్..ఇదేమి ట్విస్ట్ అండీ బాబోయ్!

Posted by venditeravaartha, November 9, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Tarun: చిన్నతనంలోనే పలు సినిమాలో బాల నటుడిగా నటించి నువ్వే కావాలి సినిమాతో హీరోగా మారారు తరుణ్. ఫస్ట్ సినిమాతోనే లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకుని వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత తన కెరీర్లో తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా సక్సెస్ అందుకోవడంలో వెనుకబడ్డారు. పలువురు హీరోయిన్లతో ప్రేమాయణాలు లాంటి వార్తలతో కెరీర్ డీలా పడిపోయింది. తనకు అవకాశాలు ఇచ్చే వారే కరువయ్యారు. దీంతో తరుణ్ చేసేదేం లేక తన బిజినెస్ చూసుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఇది ఇలాఉంటే ఆయన గురించి ఓ వార్త వైరల్ అవుతోంది.

పెళ్లి కాకుండానే తరుణ్ తండ్రి కాబోతున్నాడట. అదేంటి ఆయనకు పెళ్లి కాలేదు మరి తండ్రి ఎలా అవుతున్నాడని ఫిలింనగర్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే అది రియల్ లైఫ్ లో కాదు.. రీల్ లైఫ్లో. తరుణ్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ మధ్య మంచి ఆఫర్లు వచ్చినా ఎందుకో రిజెక్ట్ చేశాడు. మళ్లీ ఇన్నాళ్లకు మంచి పాత్ర కావడంతో ఓకే చెప్పడని టాక్ వినిపిస్తోంది.

ఓ బడా హీరో సినిమాలో తరుణ్ సెకండ్ హీరోగా సెలెక్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతోందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో తరుణ్ ఆరేళ్ల పాపకు తండ్రిగా కనిపించబోతున్నాడట. అంతేకాదు ఈ సినిమాలో తరుణ్ కి జోడిగా బ్యూటీఫుల్ హీరోయిన్ మీరా జాస్మిన్ నటించనున్నారట. ఇలా తరుణ్ పెళ్లి కాకుండానే తండ్రి రోల్ చేయడానికి ఒప్పుకున్నారని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. దీనిపై అఫీషియల్ ప్రకటన వచ్చేది ఎప్పుడో చూడాలి?.

Tags :
1096 views