Suhas: హీరో సుహాస్ సతీమణి ఎంత అందంగా ఉందో చూసారా..కుర్రాళ్ళు చూస్తే తట్టుకోలేరు!

Posted by venditeravaartha, May 29, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Suhas: యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ సక్సెస్ అయ్యి, ఆ తర్వాత సినిమాల్లో కమెడియన్ గా రాణించి ఆ తర్వాత హీరో గా కూడా రాణిస్తున్న నటుడు సుహాస్. ప్రస్తుతం ఉన్న వారిలో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ, సక్సెస్ల మీద సక్సెస్లు అందుకుంటున్న హీరో ఆయన. సుహాస్ సినిమా అంటే కళ్ళు మూసుకొని టికెట్ కొనేయొచ్చు అనే రేంజ్ బ్రాండ్ ని సొంతం చేసుకున్నాడు. ఒక యూట్యూబర్ గా కెరీర్ ని ప్రారంభించి టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ఆర్టిస్టుగా ఎదగడం అనేది సాధారణమైన విషయం కాదు. అందుకు సుహాస్ ని ఎంత మెచ్చుకున్నా తక్కువనే అవుతుంది. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్న సమయం లో సుహాస్ కి కేవలం రెండు వేల రూపాయిలు మాత్రమే ఇచ్చేవారు.

కానీ ఇప్పుడు ఆయన ఒక్కో సినిమాకి నాలుగు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. కష్టపడే తత్త్వం ఉంటే ఒక సాధారణమైన వ్యక్తి ఎంత ఎత్తుకి ఎదగగలడు అనేందుకు సుహాస్ ఒక లేటెస్ట్ ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇది ఇలా ఉండగా సుహాస్ ఒక నటుడిగా అందరికీ సుపరిచితమే కానీ, ఆయన వ్యక్తిగత వివరాలు మాత్రం ఎవరికీ తెలియవు. ఈయన కమెడియన్ గా ఇండస్ట్రీ లో కొనసాగుతున్న సమయం లోనే పెళ్లి నాగ లలిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. డిగ్రీ లో ఒక క్లాస్ మేట్ గా పరిచయమైనా నాగ లలిత, ఆ తర్వాత సుహాస్ కి అత్యంత దగ్గరై, మంచి స్నేహితురాలిగా, ప్రేమికురాలిగా మారి అతని జీవిత భాగస్వామి అయ్యింది. ఈ దంపతులిద్దరికీ ఒక బాబు కూడా ఉన్నారు. ఇక నాగ లలిత కూడా చూసేందుకు ఎంతో చక్కగా, తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంప్రదాయం తో ఉండే హీరోయిన్ ఎలా ఉంటుందో, అలా ఉంటుంది.

ఆమెకి సంబంధించిన ఫోటోలు కొన్ని ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాము చూడండి. ఇకపోతే సుహాస్ రీసెంట్ గానే ప్రసన్నవదనం అనే చిత్రం తో మన ముందుకి వచ్చి మంచి హిట్ ని అందుకున్నాడు. రీసెంట్ గానే ఈ సినిమా ఆహా మీడియా లో స్ట్రీమింగ్ అవ్వగా, ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి ముందు ఆయన చేసిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చిత్రం కూడా కమర్షియల్ గా మంచి విజయం సాధించింది. ఇలా సినిమా సినిమాకి తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ సక్సెస్లు అందుకుంటున్న సుహాస్ రాబొయ్యే రోజుల్లో ఇంకెంత ఎత్తుకి ఎదుగుతాడో చూడాలి.

Tags :
364 views