Samantha: సమంత గుట్టు మొత్తం రట్టు చేసిన మాజీ ప్రేమికుడు సిద్దార్థ్..మరీ ఇంత దారుణమా!

Posted by venditeravaartha, March 11, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Samantha: హీరోగా అందరికీ పరిచయం సిద్ధార్థ బాయ్స్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. తెలుగు తమిళ హిందీ భాషల్లో నటిస్తున్నారు సిద్ధార్థ నటుడు గానే కాక కొన్ని సినిమాలలో తన స్వరం కూడా అందించాడు సిద్దు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీ తో లవర్ బాయ్ గా ఇమేజ్ సంపాదించి బొమ్మరిల్లు మూవీతో ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు సిద్ధార్థ.ఈ మధ్యకాలంలో చిన్నా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ ని అందుకున్నాడు ఈ మూవీ మంచి మెసేజ్ నువ్వు అందించింది ఇక ప్రస్తుతం ఈ హీరో వీడియో ఒకటి నెట్ వైరల్ గా మారింది ఆ వీడియోలో హీరో సిద్ధార్థ సమంత గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. హీరోగా ఎంత సక్సెస్ అయ్యాడో వ్యక్తిగత విషయాల్లో రూమర్స్ ఎదుర్కొంటూ, సిద్ధార్థ అంతే పాపులర్ అయ్యాడు ఇప్పుడు ఆ వీడియోలో సిద్ధార్థ ఏం చెప్పాడో చూద్దాం.

సిద్ధార్థ సమంతల గురించి అప్పట్లో చాలా రూమర్స్ వచ్చాయి వాళ్ళు ప్రేమలో ఉన్నట్లు పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఏ మాయ చేసావే అని తెలుగు ప్రేక్షకులు చేరువైన సమంత నిజంగానే మాయ చేసినట్లు అభిమానులతో తన కంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది. అప్పట్లో సిద్ధార్థ తో క్లోజ్ గా ఉంటుందని ప్రేమాయణం సాగిస్తున్నారని సమంత గురించి వార్తలు వచ్చాయి. ఆ వార్తలు నిజమైనట్లుగానే వీరి ప్రవర్తన కూడా ఉండేది అప్పట్లో ఇద్దరు కలిసి జబర్దస్త్ అనే మూవీ కూడా నటించారు ఈ సినిమా ఎవరికి వచ్చినట్లు కూడా తెలియదు అంత ప్లాప్ బొమ్మగా నిలిచింది. సమంత ఆ టైంలోనే నాగచైతన్యని పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది.

ఈ పెళ్లి అప్పట్లో ఒక సెన్సేషనల్ అని చెప్పొచ్చు. సిద్ధార్థ ను వదిలేసి నాగచైతన్యని పెళ్లి చేసుకుంది అని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఎన్ని వార్తలు ఎవరు రాసిన వాటిని లెక్కచేయకుండా పెళ్లి పీటలు ఎక్కారు. శ్యామ్ చైతు ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఏమైందో తెలియదు కానీ కొన్ని రోజులకే విడాకులు అంటూ, విడిపోయారు. ఇక ఎవరి జీవితం వారిది అన్నట్లుగా బిజీగా గడుపుతున్న ఈ టైంలో సమంత గురించి సిద్దు గతంలో మాట్లాడిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది సమంత గురించి నిజం చెప్పాడు సిద్ధార్థ ఈ వీడియోలో ఇక అందరికీ షాక్ ఇస్తూ, సమంత గురించి సిద్ధార్థ చేసిన కామెంట్స్ ఈ విధంగా ఉన్నాయి.

ఆ ఇంటర్వ్యూ వీడియోలో యాంకర్ మిస్ బ్యూటిఫుల్ ఎవరు అంటే సమంతా అని చెప్పాడు అలానే మిస్ పర్ఫెక్ట్ ఎవరు అంటే సమంతా అని చెప్పుకొచ్చారు సిద్ధార్థ ఇక ఈ వీడియో చూసిన వారందరూ అప్పట్లో సిద్ధార్థ సమంతతో ప్రేమలో ఉన్నాడని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో అప్పటిదే అని ఈ వీడియోలో సమంత గురించి సిద్ధార్థ చెప్పింది నిజమేనని అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

654 views