కొంత మంది హీరో లు సినిమా ఇండస్ట్రీ కి వచ్చి మొదటి సినిమా తోనే బ్లాక్ బస్టర్ హిట్
సాధించి ఆ తర్వాత కనుమరుగై పోయినవారు ఉన్నారు.అయితే కొంత మందికి అవకాశాలు రాకపోవడం వలన ఇండస్ట్రీ నుంచి దూరమైపోతే మరికొందరు వచ్చిన అవకాశాలను సారిగా ఉపయోగలించుకోలేక సరైన సక్సెస్ లేకపోవడం తో సినీ పరిశ్రమ నుంచి దూరం అయిపోతూ ఉంటారు,కానీ వారు సినీ ఫీల్డ్ లో ఉన్నపుడు విశేష ఆదరణ ,అభిమానులని సంపాదించుకుని ఇప్పటికి కూడా వారి హృదయాల లో చెరగని ముద్ర వేసుకుని ఉంటారు.అలాంటి ఒక చెరగని ముద్ర వేసుకున్న వారే ఒకప్పటి స్టార్ హీరో ‘అబ్బాస్'(Abbas).
కోల్‌కతాకు చెందిన అబ్బాస్ తన టీనేజ్ లోనే మోడలింగ్ లో ప్రావీణ్యం పొందాడు,మొదట్లో హిందీ సినిమా ల ను వీపరీతం గా చూసే అబ్బాస్ ,హిందీ లో పెద్ద నటుడు కావాలి అని కలలు కనేవాడు అయితే అక్కడ సరైన అవకాశాలు లభించకపోవడం తో తన స్నేహితుల తో కలిసి తమిళ్ సినిమా ల లో అవకాశాల కోసం తిరిగేవారు.ఇదే సమయానికి తమిళ్ డైరెక్టర్ కథిర్ తాను తీయబోయే ‘కాదల్ దేశం'(Kadal desam) కోసం కొత్త వారిని వెతికే పనిలో ఉన్నాడు.అవకాశాల కోసం వెతుకుతున్న అబ్బాస్ కి కాదల్ దేశం లో నటించే అవకాశం దక్కింది.ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందిరికి తెలిసిందే,అదే సినిమా ని తెలుగు లో ప్రేమ దేశం(Prema desam) గా రిలీజ్ చేసారు అప్పట్లో ఉన్న యూత్ కి ఈ సినిమా పిచ్చ పిచ్చ నచ్చేసింది.అబ్బాస్ అయితే అమ్మాయిల కలల రాకుమారుడు గా మారాడు.
ఈ సినిమా ఇచ్చిన విజయం తో తమిళ్ ,తెలుగు, కన్నడ,హిందీ ,మలయాళ భాష ల అన్నిటిలోను అబ్బాస్ బిజీ అయ్యారు.అయన ఎంత బిజీ అయ్యారు అంటే శంకర్ గారి ‘జీన్స్'(Jeans) సినిమా లో హీరో గా అవకాశం వస్తే తన డేట్స్ కుదరక ఆ సినిమా ని వదులుకున్నారు.వరుస సినిమా ల తో అంత బిజీ గా ఉన్న అబ్బాస్ గారు ఇప్పుడు సినిమా ల నుంచి తప్పుకుని న్యూజిలాండ్ లో బైక్ మెకానిక్ గా పని చేస్తున్నారు.అంత స్టార్ డాం ,స్టేటస్ కలిగిన వ్యక్తి అవి అన్ని వదిలి పెట్టి అలా కావడానికి కారణం ఎన్ని అని అడగక తనకి జీవితం లో వచ్చిన కొన్ని వడిదుడుకుల కారణం గా ఆత్మహత్య చేసుకోవాలి అనిపించింది అని,అయితే అదే సమయం లో నేను ఇంతకు ముందు బ్రతికిన లైఫ్ గుర్తు వచ్చి ఆ పని చేయడం విరమించుకుని ఇక్కడ బ్రతుకుతున్నా అని చెప్పారు.మొదట ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ లో పని చేశాను ఆ తర్వాత మెకానిక్ గా పని చేస్తున్నాను.
అదే ఇండియా లో అయితే నేను ఏమి చేస్తున్నాను ఇలా ఎందుకు అయిపోయాను అని ఆరాతీస్తారు.కానీ ఇక్కడ అలా ఏమి ఉండదు ఎవరి పనులలో వారు బిజీ గా ఉంటారు.అయితే ప్రస్తుతం ఆత్మహత్యల పట్ల మొగ్గు చూపుతున్న పిల్లల మనసులు మార్చే విధానంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తాను ఆస్ట్రేలియా వెళ్లి పబ్లిక్ స్పీకింగ్‌లో సర్టిఫికేషన్ కోర్సు చేశానని అబ్బాస్ తెలిపారు.