Teja Sajja : హనుమాన్ ఎఫెక్ట్.. నేను చేయాలంటే అన్ని కోట్లు ఇవ్వాల్సిందే అంటున్న తేజ సజ్జ

Posted by RR writings, February 25, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Teja Sajja : సంక్రాంతి కానుకగా విడుదలైన హనుమాన్ సినిమా భారీ వసూళ్లను క్రియేట్ చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి జనాలను ఎంతగానో ఆకట్టుకుంది.. ఇంతకు ముందు ఏ సినిమా సాధించని రికార్డులను సైతం కైవసం చేసుకుంది. పాన్-ఇండియా స్థాయిలో హిట్ సాధించడం అంత సులభం కాదు. టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ ఇప్పుడు పాన్ ఇండియా హిట్ కొట్టి రికార్డ్ సృష్టించాడు. తేజ నటించిన ‘హనుమాన్’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ దుమ్ము దులిపి.. కలెక్షన్ల సునామీ సృష్టించింది.

పాన్ ఇండియా లెవల్లో విడుదలై హిట్ కొట్టింది.. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా కన్నడ, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో కూడా విడుదలైంది. విడుదలైన అన్ని ఏరియాల్లో హనుమాన్ సూపర్ హిట్ అయింది. విదేశాల్లోనూ ‘హనుమాన్’ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ టోటల్ గ్రాస్ 300 కోట్లకు చేరుకుంది. ఇంత పెద్ద సక్సెస్ వస్తే హీరోలు రెమ్యునరేషన్ పెంచుకోవడం మామూలే.. ఇప్పుడు తేజ కూడా భారీగానే రెమ్యునరేషన్ పెంచినట్లు తెలుస్తోంది.

ఈ సినిమా కోసం తేజ సజ్జ కోటి రూపాయల లోపే పారితోషికం తీసుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ రూ.300 కోట్ల క్లబ్‌లో చేరడంతో తేజ సజ్జకు డిమాండ్ పెరిగిపోయింది. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.5 నుంచి రూ.10 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని సమాచారం. ప్రస్తుతం ఆ సినిమాకు ‘జై హనుమాన్’ పేరుతో సీక్వెల్‌ను రూపొందిస్తున్నారు. ఇందులో కూడా తేజ సజ్జ కీలక పాత్రలో కనిపించనున్నాడని.. ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ చెబుతున్నారు.

692 views