Guess The Actress: ‘ఘటోత్కచుడు’ చిత్రంలో బాలనటిగా నటించిన ఈ చిన్నారి ఇప్పుడు పెద్ద స్టార్ హీరోయిన్..ఎవరో గుర్తుపట్టగలరా!

Posted by venditeravaartha, July 10, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Child Artist : బాలనటులుగా ఇండస్ట్రీ లో రాణించిన ఎంతో మంది నటులు నేడు ఇండస్ట్రీ లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ గా కొనసాగుతున్న వాళ్ళని ఎంతో మందిని చూసాము. అలాంటి వారిలో ఒకరు ఘటోత్కచుడు మూవీ లో నటించిన ఈ చిన్నారి. మన చిన్న తనం లో ఈ చిత్రాన్ని ఎంతలా ఇష్టపడేవారమో ప్రత్యేకించి చెప్పనవసరం లేడు. ఎస్వీ కృష్ణా రెడ్డి దర్శకత్వం తెరకెక్కిన ఈ క్లాసిక్ చిత్రాన్ని ఇప్పటికీ మనం టీవీలలో వీక్షిస్తూనే ఉంటాము. ఇందులో ఈ చిన్నారి నటనకి ముగ్దులు అవ్వని ప్రేక్షకుడు అంటూ ఎవ్వరూ ఉండరు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముద్దులొలికే మాటలతో ఘటోత్కచుడితో ఈ చిన్నారి చేసిన ఎన్నో సంభాషణలు ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించాయి.

అంతలా అద్భుతమైన నటన కనబర్చిన ఈ చిన్నారి ఎవ్వరు?, ఇప్పుడు ఎక్కడ ఉంది, ఏమి చేస్తుంది అనే సంగతి చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ ఈ చిన్నారి పెద్దయ్యాక ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో హీరోయిన్ గా నటించింది అనే విషయం తెలిస్తే మాత్రం షాక్ అవుతారు. ఇంతకీ ఆ అమ్మాయి మరెవరో కాదు, బేబీ నిఖిత. ఈమె పెద్దయ్యాక హాయ్ , కల్యాణ రాముడు, ఖుషి ఖుషీగా, సంబరం, డాన్ ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. మనం చిన్నతనం లో ఉన్నప్పుడు ఈమె పేరు అందరికీ సుపరిచితమే, కానీ కాలం గడిచే కొద్దీ మర్చిపోవడం సహజం కదా, ఆమె పేరుని మర్చిపోవచ్చు కానీ, ముఖాన్ని మాత్రం అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు.

2018 వ సంవత్సరం వరకు తెలుగు, కన్నడం, మలయాళం మరియు హిందీ భాషల్లో నటించిన ఈమె, కన్నడ లో బిగ్ బాస్ రియాలిటీ షో లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొని టాప్ 2 వరకు చేరింది. ఇలా యాక్టీవ్ గా అన్నీ ఇండస్ట్రీస్ జనాలకు సుపరిచితమైన నిఖిత, గత ఆరేళ్ళ నుండి కెమెరా కి దూరంగా ఉంటూ వస్తుంది. అయితే చాలా కాలం తర్వాత ఈమె ఫోటోలను సోషల్ మీడియా లో చూసేసరికి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎంతో చక్కగా చూడముచ్చటగా కనిపించే ఈ తెలుగు అమ్మాయి ఇలా గుర్తు పట్టలేని విధంగా మారిపోయిందేంటి అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు నెటిజెన్స్. అంతలా ఆశ్చర్యానికి గురి చేస్తున్న ఆమె లేటెస్ట్ లుక్ ఎక్సక్లూసివ్ గా మీకోసం అందిస్తున్నాం చూడండి.

Tags :
356 views