Guess The Child:ఈ చిన్నారిని గుర్తుపట్టారా..? ప్రస్తుతం పాలరాతి శిల్పం లాగ మారిన ఈ చిన్నారి లేటెస్ట్ ఫోటోలు చూసేయండి!

Posted by venditeravaartha, May 7, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Guess the Actress: ఈ ఫొటోలో ఉన్న ఈ అమ్మాయి ఎవరో గుర్తు పట్టగలరా..?, ఈమె టాలీవుడ్ లో మాత్రమే కాదు, కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తిరుగులేని స్టార్ స్టేటస్ ని దక్కించుకుంది. పాలరాతి బొమ్మ లాంటి రూపం ఉన్నప్పటికీ కూడా నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్రలనే చేస్తూ వచ్చింది. ఇక ఈమె డ్యాన్స్ కి అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి వారు కూడా తట్టుకోలేరు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. సినీ కెరీర్ ని విలన్ రోల్ తో ప్రారంభించింది కానీ, అతి తక్కువ సమయంలోనే స్టార్ లీగ్ లోకి అడుగుపెట్టింది. కొత్త హీరోయిన్లు ఏడాదికి ఎంతో మంది ఇండస్ట్రీ లో పుట్టుకొస్తున్నా కూడా ఈమె డిమాండ్ ఇసుమంత కూడా తగ్గలేదు. ఒకప్పుడు రొమాన్స్ నో చెప్పేది కానీ, ఇప్పుడు మాత్రం రొమాన్స్ లో రెచ్చిపోతుంది. ఇన్ని క్లూలు ఇచ్చినా కూడా కనిపెట్టలేకపోతున్నారా?, ఆమె మరెవరో కాదు, అందాల తార తమన్నా.

ఈమె తన కెరీర్ ని మంచు మనోజ్ హీరో గా నటించిన శ్రీ అనే చిత్రం ద్వారా ప్రారంభించింది. ఆ సినిమా పెద్దగా సక్సెస్ సాధించకపోవడం తో తమిళ సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. అక్కడ ఈమెకి రవికృష్ణ, ఇలియానా హీరో హీరోయిన్లు గా నటించిన కేడి అనే చిత్రం లో విలన్ రోల్ పోషించే అవకాశం దక్కింది. ఈ సినిమాలో నెగటివ్ రోల్ లో ఆమె నటనని చూసి అవకాశాలు క్యూ కట్టాయి. అలా పలు తమిళ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన తర్వాత ఈమెకి తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వం లో వచ్చిన ‘హ్యాపీ డేస్’ చిత్రం అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చి తమన్నా ని ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా నిలిపింది.

ఈ సినిమా తర్వాత మళ్ళీ ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ ఎవ్వరూ ఊహించని రేంజ్ కి చేరుకుంది. ఇప్పటికీ ఈమెకి క్రేజీ ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఈమధ్య కాలం లో ఈమె రొమాన్స్ కి యూత్ ఎలా పిచ్చెక్కిపోతున్నారో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. రీసెంట్ గానే ఈమె ‘బాక్’ అనే తమిళ చిత్రం లో నటించింది. ఈ సినిమా అక్కడ కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వం ‘ఓడేలా 2 ‘ లో నటిస్తుంది. రీసెంట్ గానే ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది.

583 views