Guess the Actress:ఈ ఫోటో లో ఒక పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్ ఉంది..ఎవరో గుర్తుపట్టగలరా?

Posted by venditeravaartha, May 3, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Tollywood: ఈ ఫోటో లో వరుసగా కూర్చున్న ఈ అమ్మాయిలలో ఇప్పుడు ఒక అమ్మాయి పాన్ ఇండియా లెవెల్ లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని దున్నేస్తుంది. ఆమె ఎవరో గుర్తుపట్టారా?. అందం తో పాటుగా అద్భుతమైన అభినయం ఆమె సొంతం. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి చాలా తక్కువ సమయమే అయ్యింది కానీ, తన కంటే ఇండస్ట్రీ లో ఎంతో కాలం నుండి ఉంటున్న స్టార్ హీరోయిన్స్ రేంజ్ ఇమేజి ని ఆమె సొంతం చేసుకుంది. ఆఫర్స్ వస్తున్నాయి కదా అని మిగిలిన హీరోయిన్స్ లాగ ఎలా పడితే చేసే హీరోయిన్ కాదు ఆమె. నటనకి ప్రాధాన్యత ఉంది కుర్ర హీరోయిన్ అయ్యినప్పటికీ కూడా నెగటివ్ రోల్ చెయ్యడానికి ఏమాత్రం ఆలోచించదు.

ఆమె మరెవరో కాదు సంయుక్త మీనన్. ఈమె మలయాళం లో స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతూ, తెలుగు లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ మూవీ భీమ్లా నాయక్ ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైంది. మొదటి సినిమాతోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న ఈమె, ఆ తర్వాత కూడా వరుస విజయాలతో దూసుకుపోయింది. గత ఏడాది ఈమె ‘విరూపాక్ష’ చిత్రం ద్వారా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ ని అందుకుందో మన అందరికీ తెలుసు.

ఈ సినిమాలో విలన్ రోల్ చేసి ఆడియన్స్ తెగ బయపెట్టేసింది. ఇప్పటి వరకు చేసిన సినిమాలలో కేవలం ‘డెవిల్’ మాత్రమే కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యింది. మిగిలిన సినిమాలన్నీ కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ప్రస్తుతం ఈమె నిఖిల్ సిద్దార్థ్ హీరో గా నటిస్తున్న ‘స్వయంభు’ అనే చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో పాటు మలయాళం లో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ తన కాల్ షీట్స్ ని ఫుల్ బిజీ గా ఉంచుకుంటుంది. రాబోయే రోజుల్లో ఈమె ఇంకెంత రేంజ్ కి వెళ్తుందో చూడాలి.

350 views