Guess the Actress: పవన్ కళ్యాణ్ ఖుషి మూవీ అందరికీ గుర్తుంటుంది ఆ మూవీలో సెకండ్ హీరోయిన్గా నటించిన ముంతాజ్ మంచి పేరు తెచ్చుకున్నారు ఇక పవన్ కళ్యాణ్ భూమిక తర్వాత ఈ మూవీలో ముంతాజ్ పేరు ఎక్కువగా వినిపించింది తెలుగులో పలి సినిమాలలో ఐటెం సాంగ్స్ చేసిన ఈ ముద్దుగుమ్మ చాలా కాలం గ్యాప్ ఇచ్చి పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేదిలో మళ్ళీ కనిపించి అభిమానులను మెప్పించింది. ఈ సినిమాలో ఓరి దేవుడా దేవుడా సాంగ్ లో కనిపించి కుర్రకారు ను కవ్వించింది. ఖుషి మూవీ లో చూసి తర్వాత అత్తారింటికి దారేదిలో చూసిన ఈమె అందం మాత్రం కొంచెం కూడా తగ్గలేదని అప్పట్లో టాక్ కూడా వచ్చింది. కారణం ఏదైనా కానీ తర్వాత సినిమాల్లో పెద్దగా కనిపించలేదు ఇది ఇలా ఉంటే తాజాగా ముంతాజ్ ఫోటో ఒకటి వైరల్ అవుతుంది ఆ ఫోటో గురించి ఇప్పుడు చూద్దాం.
1999 లోనే ఇండస్ట్రీకి వచ్చిన ముంతాజ్, తెలుగులోనే కాకా కోలీవుడ్ లో కూడా హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించారు . ముంతాజ్ నటించిన చిత్రాల్లో జెమినీ,ఖుషి, ఆగడు అత్తారింటికి దారేది మంచి గుర్తింపు తెచ్చిన సినిమాలు. 2015 లో వచ్చిన టామీ సినిమా ఈమె చివరిగా వెండి తెర మీద కనిపించారు. ఈమె ప్రస్తుత ఫోటో చూస్తే ఎవరు గుర్తుపట్టలేనట్టుగా ఉంటుంది దానికి కారణం ముంతాజ్ హిజాబ్ ధరించడం.
ఈమె హిజాబ్ ధరించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈమె పూర్తిగా నటనని పక్కన పెట్టేయడానికి కారణం కూడా వెల్లడించారు నేను ముస్లిం కుటుంబంలో పుట్టాను. నాకు ఖురాన్ బాగా తెలుసు మొదట్లో ఆ ఖురాన్ లో అర్థం పూర్తిగా తెలిసేది కాదు తర్వాత అర్థం చేసుకొని నాలో మార్పు రావాలని నిర్ణయించుకున్నాను అందుకే సినిమాలు మానేశాను ఇప్పుడు హిజాబ్ ధరిస్తున్నాను అని మాజీ నటి ముంతాజ్ వెల్లడించారు. అప్పటి ముంతాజ్ ని చూసినవారు ఇప్పుడు ఈ హిజాబ్ డ్రెస్ లో చూసి గుర్తుపట్టలేకపోతున్నారు. ఈమె అప్పటి ఖుషిలోని ముంతాజ్ అని తెలిసి షాక్ అవుతున్నారు.