Bhima Movie :’భీమా’ మూవీ ఫుల్ రివ్యూ..గోపీచంద్ కెరీర్ లో ఇలాంటి సినిమా లేదు!

Posted by venditeravaartha, March 8, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Bhima Review : తెలుగు ఇండస్ట్రీలో కాదు సినీ రంగంలో ఒకసారి స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత దాన్ని కాపాడుకోవడం చాలా కష్టం. వరుస హిట్స్ వస్తే పర్లేదు కానీ ఒకసారి ప్లాప్ పడితే మళ్లీ హిట్టు వచ్చేవరకు ఎంతకాలమైనా ఆ హీరో తపించాల్సిందే కొంతమంది హీరోలకి ప్లాప్ వచ్చినా కూడా వాళ్ళ క్రేజ్ మాత్రం ఎప్పుడూ తగ్గదు. అలాంటి హీరోల్లో గోపీచంద్ ఒకరు ఈరోజు ఆయన నటించిన భీమా మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

ఈ మధ్యకాలంలో గోపీచంద్ కి హిట్స్ పెద్దగా లేవు ఈ మూవీ మీద చాలా అసలు పెట్టుకున్నాడు రామబాణం కూడా పెద్దగా ఆశించిన స్థాయిలో హిట్ అవ్వలేదు. కొంచెం గ్యాప్ తీసుకుని కన్నడ డైరెక్టర్ ఏ హర్ష తో భీమా మూవీని చేశాడు. ఈ మూవీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది గోపీచంద్ సరసన హీరోయిన్ గా మాళవికా శర్మ,ప్రియా భవాని శంకర్ నటిస్తున్నారు. ఈ మూవీ కేకే రాధా మోహన్ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు గతంలో ఈ బ్యానర్ లో పంతం మూవీని గోపీచంద్ చేశారు.

కథ :

ఈ మూవీ కథ విషయానికొస్తే పరుశురామ క్షేత్రం చుట్టూ తిరుగుతూ ఉంటుంది చారిత్రాత్మక ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రంలో కొన్ని ఊహించని సంఘటన జరుగుతుంటాయి వాటిని మన హీరో గోపీచంద్ పోలీస్ ఆఫీసర్ గా ఎంట్రీ ఇచ్చి ఆ సమస్యలను పోరాడుతాడు అసలు హీరో పోలీస్ ఆఫీసర్ గా ఈ ఊరికి రావడానికి నాజర్ కారణమవుతాడు అసలు నాజర్ కి హీరోకి ఉన్న సంబంధం ఏమిటి? హీరో నాజర్ కి ఎందుకు మాట ఇస్తాడు అసలు హీరో ఈ పరిశ్రమ క్షేత్రానికి గతంలో ఏమైనా సంబంధం ఏమైనా ఉందా హీరో నాదరికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా లేదా అన్నది తెలియాలంటే సినిమా థియేటర్లో చూడాల్సిందే.

గోపీచంద్ నటన ఈ మూవీలో చాలా బాగుందని టాక్ ఇక సినిమా పోలీస్ ఆఫీసర్ పాత్రలో గోపీచంద్ అద్భుతంగా నటించాడు భీమా మూవీ ఫస్ట్ అఫ్ కామెడీ సన్నివేశాలతో సెకండ్ హాఫ్ రొటీన్ గా ఉన్న ఒక ట్విస్ట్ తో మూవీ అల్లరిస్తుంది అంట ఈ మూవీ ఈ మధ్యకాలంలో వచ్చిన గోపీచంద్ సినిమాల్లో బెటర్ అని అంటున్నారు.

424 views