Genelia d’souza: నడి రోడ్డు మీద మూడు రాత్రులు జెనీలియా కి టార్చర్ ఏంటో చూపించిన స్టార్ డైరెక్టర్..అసలు ఏమి జరిగిందంటే!

Posted by RR writings, October 18, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]


Genelia d’souza: జెనీలియా డిసౌజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మన తెలుగు ప్రేక్షకులకు హ హ హాసినిగా ఎప్పటికీ గుర్తుండి పోతుంది. ఇండియా టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ సినిమాలో నటించి ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. సిద్ధార్థతో నటించి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఎన్నో క్రేజీ సినిమాల్లో నటించి స్టార్ స్టేటస్ అందుకుంది. టాలీవుడ్ లోని దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించింది. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో రొమాన్స్ చేసి హిట్ కొట్టింది. కెరీర్ పీక్ స్టేజీలో ఉండగానే బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ను పెళ్లాడింది. ఆ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. పండండి ఇద్దరు పిల్లలకు తల్లై వారి ఆలన పాలన చూసుకుంటుంది. రామ్ చరణ్ తో కలిసి తీసిన ఆరెంజ్ మూవీ తెలుగులో జెనీలియా ఆఖరి సినిమా. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సెకండ్ ఇన్నింగ్స్ కోసం ప్రయత్నిస్తుంది. ఇటీవల తన భర్త రితేష్‌తో కలిసి తెలుగులో సూపర్ హిట్ అయిన మజిలీ సినిమాను మరాఠీ రీమేక్ లో నటించింది.

త్వరలో ఓ స్టార్ హీరో సినిమాతో సౌత్ లోకి రీ ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే జెనీలియా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఓ షాకింగ్ విషయం బయటపెట్టింది. ఓ దర్శకుడు తనను చిత్రహింసలకు గురిచేశాడని జెనీలియా తెలిపింది. ఆ దర్శకుడి వల్ల ఆమె మూడు నాలుగు రోజులు నిద్రలేని రాత్రులు గడిపానని చెప్పింది. జెనీలియా అనగానే ఠక్కున గుర్తుకు వచ్చే పాత్ర హాసినీ. భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. సిద్ధార్థ్ నటించిన ఈ సినిమాలో జెనీలియా హాసిని పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ పాత్రలో జెనీలియా చాలా క్యూట్ అండ్ స్వీట్ గా కనిపించింది. అమాయక యువతిగా పాత్రలో జెనీలియా అద్భుతంగా నటించింది.

ఈ పాత్ర కోసం ఆమె చాలా కష్టపడింది. ఈ సినిమాలో ఓ సన్నివేశం కోసం దర్శకుడు భాస్కర్ మూడు రాత్రులు తనకు నిద్ర లేకుండా చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఓ సారి సినిమా చేయలేక వెళ్లిపోవాలని నిర్ణయించుకుందట. బొమ్మరిల్లు సినిమాలో హీరో సిద్ధార్థ్‌తో కలిసి జెనీలియా ఐస్‌క్రీం తినే సన్నివేశం షూటింగ్ కోసం అర్థరాత్రి జెనీలియాను రప్పించారు. కానీ ఆమె సరిగ్గా చేయకపోవడంతో ఆ సీన్ మూడు రోజుల పాటు జరిగిందట. జెనీలియా మూడు రోజులు నిద్ర లేకుండా గడిపింది. డైరెక్టర్ టార్చర్ భరించలేక షూటింగ్ కి రానని చెప్పి వెళ్లిపోయింది. రెండు రోజులు షూటింగ్‌కి కూడా రాలేదు. తర్వాత ఆమె స్నేహితుడు అల్లు అర్జున్ జెనీలియాను మళ్లీ షూటింగ్‌కి వెళ్లమని ఒప్పించాడట.

355 views