Movie review:ఎక్సక్లూసివ్ గా ‘రంగమార్తాండ’ రివ్యూ మీ కోసం

Posted by venditeravaartha, March 22, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

గులాబీ ,నిన్నే పెళ్లాడతా ,అంతఃపురం,మురారి,ఖడ్గం వంటి క్లాసిక్ సూపర్ హిట్ లను తెరక్కేకించిన క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ చాల సంవత్సరాల గ్యాప్ తీసుకుని తెరకెక్కించిన లేటెస్ట్ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రంగమార్తాండ. ఈ సినిమా మరాఠి బ్లాక్ బస్టర్ అయినా ‘నటసామ్రాట్ ‘ కి రీమేక్. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ యొక్క టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. మరి నేడు భారీ అంచనాలతో ఉగాది పండగ పర్వదిన న రిలీజ్ అయినా ‘రంగమార్తాండ’ ఎలా ఉంది ,ప్రేక్షకుల మనసు గెలుచుకుందా ,లేదా అని చూద్దాం !

ఇక కథ విషయం లో కి వెళ్తే రాఘవరావు (ప్రకాష్ రాజ్) చిన్న తనం నుంచి నాటక రంగం లో గొప్ప గొప్ప పాత్రా లు వేస్తూ ఉన్నత స్థాయికి చేరుకున్న రంగస్థల నటుడు. కళకు ఆయన చేసిన అపూర్వమైన కృషికి, అతనికి ‘రంగమార్తాండ’ అనే బిరుదు దక్కుతుంది. రాఘవరావుకి వయసు మీదపడుతున్నకొద్దీ అతను రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకుని తన ఆస్తిని పిల్లలైన శ్రీ (శివాత్మిక రాజశేఖర్) మరియు రంగా (ఆదర్శ్ బాలకృష్ణ)కి పంచుతాడు.
ఆస్తి పంచి ఇచ్చిన తర్వాత ఇంట్లో నే ఉండటం ,చిన్న చిన్న విషయాలకి తన పిల్ల ల దగ్గర ఎన్నో మాటలు పడుతుంటారు. ఈ సినిమాలో ప్రధానమైన బలం రాఘవరావు పాత్రకి ప్రకాష్ రాజ్ ని తీసుకున్న దర్శకుడు కృష్ణవంశీ నిజంగా అభినందనీయులు. ఆ పాత్రలో ప్రకాష్ రాజ్ నటించారు అని అనడం కంటే పరకాయ ప్రవేశం చేసి జీవించారు అని చెప్పాలి.

రంగమార్తాండ లో సెకండ్ హాఫ్ అయితే ఎంతో హృద్యమైన ఎమోషన్స్ తో సాగుతుంది. రంగస్థల నటులు వారి జీవితంలో ఎదురైన సమస్యలు లను ఎదుర్కొని ఏవిధంగా ముందుకు నడుస్తారు అనే పాయింట్ ని ఎంతో బాగా చూపించారు. క్లైమాక్స్ అయితే మరింత అద్భుతం. కామెడీ ని పండించగల నటులు ఎటువంటి రకమైన పాత్రలు లో కూడా జీవించగలరు అని మరొక సరి నిరూపించారు పద్మశ్రీ బ్రహ్మానందం గారు.

ఫస్ట్ హాఫ్ లో కామెడీ పంచిన ఆయన పాత్ర సెకండ్ హాఫ్ ఎంతో ఎమోషనల్ గా మనల్ని కదిలిస్తుంది. మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక సీన్ లో ఆయన నటనకి మన కంటి వెంట నీరు ఆగదంటే అతిశయోక్తి కాదేమో. భర్త మాట కాదనకుండా ఉండే భార్య పాత్రా లో ప్రకాష్ రాజ్‌కి సపోర్ట్ ఆర్టిస్ట్ గా రమ్యకృష్ణ కూడా తన పరిధి దాటి చాల బాగా నటించారు.శివాత్మిక రాజశేఖర్ తన పాత్రలో సహజంగా, ఆకట్టుకునేలా పెర్ఫార్మ్ చేసారు. అలానే అనసూయ భరద్వాజ్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌, ఆదర్శ్‌ బాలకృష్ణ తమ తమ పాత్రల్లో చాలా బాగా నటించారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి అందించిన షాయరీ కథా నేపథ్యంలో వస్తూ మన మనసుని తాకుతుంది. ఆ విధంగా ఆకట్టుకునే కథ కథనాలతో దర్శకుడు కృష్ణవంశీ అందరి మనసులు తాకేలా రంగమార్తాండ ని మన అమ్మానాన్న ల కథగా మంచి మెసేజ్ తో తెరకెక్కించారు.

1987 లో రిలీజ్ అయినా ‘సంసారం ఒక చదరంగం’ మూవీ అప్పట్లో పెద్ద విజయం సాధించింది , ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లో ఉండే సమస్యలు ,ఎమోషన్స్ మధ్య ఈ మూవీ
ఉంటుంది , ఇదే మాదిరిగా ‘రంగమార్తాండ’ లో కూడా అలాంటి ఎమోషన్స్ కనిపిస్తుంటాయి. అయితే ఆ మూవీ చూడని వారిని ‘రంగమార్తాండ’ ఒక అద్భుతమైన క్లాసిక్ గా అనిపిస్తుంది .

మాస్ట్రో ఇళయరాజా గారు అందించిన సాంగ్స్ ఈ సినిమాకు మంచి బలం. రాజ్ కె నల్లి ఫోటోగ్రఫి బాగుంది, నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. ఎడిటింగ్ వర్క్ కూడా బాగుంది. ఇక ఆకెళ్ళ శివ ప్రసాద్ రాసిన డైలాగ్స్ ఎంతో బాగున్నాయి. కొంత గ్యాప్ తీసుకున్నప్పటికీ మరొక్కసారి తన అద్భుత దర్శకత్వ ప్రతిభని రంగమార్తాండ తో దర్శకుడు కృష్ణవంశీ బయటకు తీశారు. ఫస్ట్ హాఫ్ సరదాగా సెకండ్ ఎమోషనల్ గా అన్ని వర్గాల ఆడియన్స్ మనసుని తాకేలా ఆయన ఈ మూవీ తెరకెక్కించారు.


చివరగా ‘రంగమార్తాండ’ రంగస్థల కళాకారుడి కధ. రియల్ ఎమోషన్స్ ఉన్న సబ్జెక్ట్ కి గొప్ప నటీనటులు కలిసినప్పుడు, ఫలితం రంగమార్తాండ లానే ఉంటుంది. ముఖ్యంగా కృష్ణవంశీ ఈ సినిమాని అన్ని వయసుల వారిని ఆకట్టుకునేలా తీశారు. ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఈ ఎమోషనల్ డ్రామా బాగా కనెక్ట్ అవుతుంది. అయితే అక్కడక్కడా లోపాలు లేకపోలేదు. కొన్ని సమయాల్లో నెమ్మదిగా సాగే కథనం ఆడియన్స్ కి గత సినిమాలను చూసిన అనుభూతిని కలిగిస్తుంది. కానీ ఎమోషన్స్ ని క్యారీ చేసిన విధానం చాలా బాగుంది. అయితే రంగమార్తాండ సినిమాలో ప్రకాష్ రాజ్ మరియు బ్రహ్మానందం అద్భుతమైన నటనను చూసి తరించవచ్చు. తప్పకుండా కుటుంబం మొత్తంగా చూడదగ్గ మూవీ ఇది.ఫ్యామిలీ అంత తప్పకుండా చూడాల్సిన గొప్ప సినిమా ‘రంగమార్తాండ ‘ , ఈనాటి యువత కూడా తప్పకుండా చూసి తరించాల్సిన సినిమా.


ప్లస్ :
ప్రకాష్ రాజ్ ,బ్రహ్మానందం,రమ్య కృష్ణ ,ఎమోషనల్ సీన్స్ ,సంగీతం,నిర్మాణ విలువలు, క్లైమాక్స్ ,కృష్ణ వంశి గారి డైరెక్షన్.
మైనస్ :పాత కథ ,ఓవర్ ఎమోషన్స్.
రేటింగ్:4 / 5

227 views