Double Ismart: ‘డబుల్ ఇస్మార్ట్’ మొట్టమొదటి రివ్యూ..పూరి జగన్నాథ్ కి పైత్యం తగ్గలేదు!

Posted by venditeravaartha, July 28, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Double Ismart: టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ లో ఒకరు అయినా రాజమౌళి గారి ఫేవరెట్ మరియు ఆయన తండ్రి గారు అయినా విజయంద్రప్రసాద్ గారికి ఎంతో ఇష్టమైన డైరెక్టర్ పూరీజగన్. పవన్ కళ్యాణ్ గారితో బద్రి సినిమా తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన పూరి గారు ఆ తర్వాత రవితేజ ,ఎన్టీఆర్ ,మహేష్ బాబు ,రామ్ చరణ్ ,అల్లు అర్జున్ ,ప్రభాస్ వంటి స్టార్ హీరో ల తో బ్లాక్ బస్టర్ సినిమా లను తీసిన విషయం తెలిసిందే.అయితే తన సినిమా కెరీర్ లో ఎప్పుడు చూడని సక్సెస్ చుసిన పూరి గారు ఇప్పుడు ఒక్క హిట్ కోసం ఎంత ఎదురుచూస్తున్నారో ప్రత్యకంగా చెప్పాల్సిన పని లేదు.విజయ్ దేవరకొండ తో చేసిన లైగర్ డిసాస్టర్ కావడం తో తనకి కం బ్యాక్ ఇచ్చిన ఇస్మార్ట్ ‘రామ్ ‘ నే నమ్ముకున్నారు పూరి గారు.

2015 లో రిలీజ్ అయినా టెంపర్ సినిమా తర్వాత సరైన సక్సెస్ లేని పూరీజగన్ గారికి ,ఎనర్జిటిక్ స్టార్ ‘రామ్ పోతినేని’ గారు ఒక మిస్సైల్ లా దొరికారు. అప్పటి వరకు రొమాంటిక్ యాక్షన్ సినిమా లు చేసిన రామ్ ని ఒక పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్ లో చూపించారు. 2019 లో రిలీజ్ అయినా ఇస్మార్ట్ శంకర్ ,రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అవ్వడం మరియు అప్పటి వరకు సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న పూరీజగన్ కి బెస్ట్ బూస్ట్ ఇచ్చింది అనే చెప్పాలి.ఇక ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిన సక్సెస్ తో భారీ స్థాయి లో విజయ్ దేవరకొండ ని హీరో గా మరియు బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే , హాలీవుడ్ మైక్ టైసన్ తో లైగర్ ని చేసారు.

2022 లో రిలీజ్ అయినా లైగర్ మూవీ అనుకున్న ఆడకపోవడం మరియు భారీ స్థాయి లో నష్టాలను మిగిల్చింది.లైగర్ మూవీ ని కొన్న వారు తమకి న్యాయం చేయాలి అని పూరి జగన్ ,హీరో విజయ్ దేవరకొండ ని అడుగుతూ న్యాయ పోరాటం చేసారు అంటే ఏ స్థాయి లో నష్టాలను చూసారో తెలుస్తుంది.అయితే తన తోటి డైరెక్టర్ ల లో రాజమౌళి ఇండియా లెవెల్ లో భారీ సినిమా లు తీస్తూ దూసుకుపోతున్న తరుణం లో తన మార్క్ సినిమా చేసి సక్సెస్ సాధించాలి అని మారాలా ‘ఇస్మార్ట్ శంకర్ 2 ‘ తో వస్తున్నారు.ఈ సారి డబల్ ఇస్మార్ట్ కంఫర్మ్ తెలియచేసారు.ఇప్పటికే రిలీజ్ అయినా టీజర్ ,సాంగ్స్ తో మంచి పాజిటివ్ వైబ్ ఉన్నప్పటికీ పూరీజగన్ ,రామ్ గత సినిమా ల ప్రభావం వలన సినిమా బాగుంటే తప్ప హిట్ అయ్యేలా లేదు అని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.ఆగస్టు 15 న పాన్ ఇండియన్ లెవెల్ లో రిలీజ్ కి ప్లాన్ చేసారు.మరి ఈ డబల్ ఇస్మార్ట్ శంకర్ తో అయినా అటు పూరీజగన్ మరియు రామ్ సక్సెస్ బాట పడతారో లేదో చూడాలి.

524 views