Prabhas: బట్టలు లేకుండా కనిపించాలంటే ప్రభాస్ ఇన్ని కండిషన్స్ పెట్టేవాడా!

Posted by venditeravaartha, May 24, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్(Prabhas) ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి సినిమా తరువాత ఈ రెబల్ స్టార్ పాన్ వరల్డ్ హీరో అయిపోయాడు. ఇప్పుడు ఆయనతో భారీ బడ్జెట్ మూవీస్ మాత్రమే తీస్తున్నారు. అయితే బాహుబలి తరువాత రిలీజైన సాహో, రాధే శ్యామ్ తీవ్ర నిరాశ పరిచాయి. అయినా రెబల్ స్టార్ తీరిక లేకుండా సినిమాలతో బిజీగా మారాడు. ఆయన లేటేస్టు మూవా ‘ఆది పురుష్’ త్వరలో థియేటర్లోకి రానుంది. ఈ సందర్భంగా ప్రభాస్ గురించి ఓ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. బట్టల్లేకుండా నటించాలంటే ప్రభాస్ కు అస్సలు ఇష్టముండదట. అయితే ఆయన నటించిన కొన్ని సినిమాల్లో ఇలాంటి సీన్స్ వచ్చాయి. అప్పుడు ప్రభాస్ ఏం చేశాడో తెలుసా?

eeswar movie

‘ఈశ్వర్’(Eeswar) అనే మొదటి సినిమాతో ప్రభాస్ గుర్తింపు తెచ్చుకున్నాడు. సినీ బ్యాగ్రాండ్ ఉన్నా..ప్రభాస్ కు సొంతంగా ఇమేజ్ ఉంది. ఛత్రపతి సినిమా తరువాత ప్రభాస్ రేంజ్ పాన్ ఇండియా వైడ్ గా మారింది. ఆ తరువాత రాజమౌళి తీసిన బాహుబలితో మరింత గుర్తింపు వచ్చింది. యాక్షన్ సినిమాలే కాకుండా లవ్ చిత్రాల్లోనూ ప్రభాస్ ఆకట్టుకున్నాడు. ఆయన హీరోగా వచ్చిన వర్షం, పౌర్షమి, రాధేశ్యామ్ చిత్రాలు పీల్ గుడ్ తెప్పిస్తాయి. అయితే ఈ సినిమాల్లో రొమాన్స్ సన్నివేశాల్లో నటించేటప్పుడు ప్రభాస్ కాస్త ఇబ్బంది పెట్టాడట.

prabhas with trisha

ప్రభాస్, త్రిష(Trisha) కాంబినేషన్లో రెండు సినిమాలు వచ్చాయి. వీటిలో వర్షం బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. ఇదే ఊపుతో పౌర్ణమి(pournami) తీశారు. ఈ సినిమాలో త్రిషతో ఓ రొమాన్స్ సీన్ ఉంటుంది. ఇందులో ప్రభాస్, త్రిషలు బట్టల్లేకుండా నటించాలి. అంటే సీన్స్ లో నటించేటప్పుడు వేరే విషయం. అయితే ఈ సమయంలో ప్రభాస్ అస్సలు ఒప్పుకోలేదట. ప్రభాస్ తన డ్రెస్ తీసేయాలంటే అస్సలు ఒప్పుకోలేదట.

radhe syam

అవసరమైతే ఈ సీన్ తీసేయాలని ప్రభాస్ మొండికేసి కూర్చున్నాడట. దీంతో పెద్దాయన కృష్ణం రాజు రంగంలోకి దిగి సర్దిచెప్పడంతో ప్రభాస్ ఆ సీన్ చేయడానికి ఒప్పేసుకున్నాడట. అలా పౌర్ణమితో పాటు రాధే శ్యామ్(Radhe syam) సినిమాలోనూ ప్రభాస్ అలాంటి సీన్లలో నటించడానికి డైరెక్టర్లను ఇబ్బంది పెట్టాడట. అయితే ఇలాంటి సీన్ల ఉంటే పండుగ చేసుకుంటారు హీరోయిన్లు.. కానీ ప్రభాస్ మాత్రం అడ్డు చెప్పడంపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

1707 views