Virupaksha: విరూపాక్ష లో విలన్ క్యారెక్టర్ ని మిస్ చేసుకున్న ఆ స్టార్ యాంకర్ ఎవరో తెలుసా !

Posted by venditeravaartha, May 26, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్(Sai tej) ,సంయుక్త(Samyuktha) ప్రధాన పాత్రా ల లో నూతన దర్శకుడు కార్తీక్ దండు డైరెక్షన్ లో ఈ సంవత్సరం రిలీజ్ అయినా విరూపాక్ష మూవీ ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది అనేది తెలిసిందే..సాయి తేజ్ కెరీర్ లో 100 కోట్ల కలెక్షన్స్ క్రాస్ చేసి రికార్డు ల ను సృష్టించింది విరూపాక్ష.సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా సుకుమార్ గారి స్క్రీన్ ప్లే తో వేరే లెవెల్ కి వెల్లింది అని చెప్పొచ్చు.ఈ సినిమా లో ప్రధానంగా సంయుక్త క్యారెక్టర్ ని డిజైన్ చేసిన విధానం ,ఆమె నటన సినిమా కి ఎంతగానో ప్లస్ అయ్యాయి అనొచ్చు.ఇప్పుడు ఇదే విషయం మీద ఈ సినిమా డైరెక్టర్ కార్తీక్ దండు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి.

sai tej

విరూపాక్ష(Virupaksha) సినిమా ప్రథమార్ధం లో ఒక ఊరు ని కొన్ని దుష్ట శక్తులు ఆవహించి నాశనం చేస్తూ ఉంటాయి,వరుస హత్యలు జరుగుతున్న సమయం లో ఆ ఊరిలోకి ప్రవేశించిన సూర్య ఉరిని ఎలా కాపాడు అనేది కథ.అయితే ఇందులో చేసిన సీరియల్ నటుడు రవి కృష్ణ ,సోనియా ల తో పాటుగా పార్వతి క్యారెక్టర్ చేసిన శ్యామల కూడా చాల ముఖ్య పాత్రా పోషించారు.క్లైమాక్స్ వరకు సినిమా లో విల్లన్ ఎవరు అనేది సస్పెన్స్ గా చూపించిన డైరెక్టర్ చివరిగా నందిని(సంయుక్త) ని మెయిన్ విల్లన్ గా చూపించారు.

shyamala

సూర్య తో ప్రేమ లో ఉంటూ వచ్చిన నందిని ఆ ఊరిని నాశనం చేసే ఫుల్ నెగటివ్ రోల్ లో కనిపించారు సంయుక్త.క్లైమాక్స్ లో సీన్ ల లో అందరికి గూస్ బాంబ్స్   తెప్పించింది.అయితే డైరెక్టర్ కార్తీక్ తాను కథ రాసుకున్నపుడు క్లైమాక్స్ లో విలన్ గా పార్వతి క్యారెక్టర్ చేసిన యాంకర్ శ్యామల(Shyamala) ని అనుకున్నారు అంట.అయితే స్క్రిప్ట్ ని చుసిన సుకుమార్ గారు తన స్క్రీన్ ప్లే తో పార్వతి క్యారెక్టర్ ప్లేస్ లో నందిని పెట్టారు.సినిమా కి హైలైట్ గా నిలిచినా క్లైమాక్స్ ని సుకుమార్ గారే దగ్గర ఉండి చేయించారు అని చెప్పాడు ఈ సినిమా డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు.

1655 views