Prabhas: ప్రభాస్ కెరీర్ ని మలుపు తప్పిన వర్షం సినిమా ని రిజెక్ట్ చేసిన ఆ హీరో ఎవరో తెలుసా ?

Posted by venditeravaartha, June 6, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

పాన్ ఇండియన్ స్టార్ గా ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని ఏలుతున్న ప్రభాస్(Prabhas) గారికి తన కెరీర్ లో వర్షం(Varsham) సినిమా ఎంత పెద్ద బ్రేక్ ఇచ్చిందో మన అందరికి తెలుసు.ఈశ్వర్ ,రాఘవేంద్ర సినిమా లు చేసిన తర్వాత మంచి కమర్షియల్ హిట్ కోసం ఎదురు చూస్తున్న ప్రభాస్ కి శోభన్ గారు వర్షం సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ ని అందించారు.2004 లో సంక్రాంతి కి రిలీజ్ అయినా వర్షం మూవీ ప్రభాస్ కెరీర్ ని మలుపు తిప్పడమే కాకుండా ఆ సంవత్సరం హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమా గా రికార్డు ని సృష్టించింది.ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించింది అంటే మెగాస్టార్ చిరంజీవి ,బాలకృష్ణ గార్ల సినిమా లని వెనక్కి నెట్టి 2004 లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

varsham movie

ప్రభాస్ ,త్రిష(Trisha) కలయిక లో వచ్చిన ఈ లవ్ స్టోరీ కి దేవి శ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ మరో హైలైట్ అని చెప్పాలి. విలన్ గా గోపీచంద్ గారి నటన ,కన్నింగ్ ఫాదర్ గా ప్రకాష్ రాజ్ గారి నటన మరో హైలైట్.ప్రభాస్ గారి ఈశ్వర్ సినిమా అయ్యాక డైరెక్టర్ రాజమౌళి మంచి యాక్షన్ స్టోరీ తో తన తో సినిమా చేయడానికి ప్లాన్ చేసారు అయితే తన మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 హిట్ అయినప్పటికి ప్రభాస్ కి నచ్చలేదు.అందుకే ఆయన తో సినిమా ని రిజెక్ట్ చేసారు.ఆ తర్వాత రాజమౌళి ఎన్టీఆర్ గారితో సింహాద్రి సినిమా తీసి బ్లాక్ బస్టర్ కొట్టాడు.ఇక ఇదే విషయం ని బాహుబలి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ చెప్పారు.సింహాద్రి తర్వాత రాజమౌళి పెద్ద డైరెక్టర్ అయిపోయాడు కదా ఇక మనతో సినిమా చేస్తాడా అని ,అప్పటికి నాకు వర్షం మూవీ కూడా రాలేదు అని పది సార్లు పైన అన్నారు.

trisha prabhas

వర్షం మూవీ తన కెరీర్ కి ఎంత హెల్ప్ అయింది అనేది ఆ మాటలను బట్టి అర్ధం అవుతుంది
మరి అంతటి బ్లాక్ బస్టర్ మూవీ ని తనకి ఇచ్చిన డైరెక్టర్ శోభన్ గారు ఈ సినిమా ని ప్రభాస్ కి ముందు మరో హీరో తో చేయాలి అని ప్లాన్ చేసుకున్నారు అంట,అయన ఎవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu).2001 లో రిలీజ్ అయినా మురారి సినిమా కి డైలాగ్ రైటర్ గా పని చేసిన శోభన్ ఆ తరువాత తన మొదటి సినిమా బాబీ ని మహేష్ బాబు తో చేసాడు.తన రెండవ సినిమా వర్షం కథ ని కూడా మహేష్ బాబు గారికి వినిపించారు అంట అయితే అప్పటికే తాను ఒక్కడు ,నిజం ,నాని ,అర్జున్ సినిమా ల తో బిజీగా ఉండటం,తమ మొదటి సినిమా బాబీ ప్లాప్ అవడం లాంటి కారణాలతో వర్షం మూవీ ని రిజెక్ట్ చేసారు మహేష్.ఆయన రిజెక్ట్ చేయడం ప్రభాస్ కి వరం లాగా మారింది.ఇక వర్షం ఆడియో రిలీజ్ కి గెస్ట్ గా మహేష్ వచ్చారు.

mahesh prabhas

1658 views