Balakrishna: బాలకృష్ణ వదులుకున్న రాజమౌళి సినిమాలు ఏవో తెలుసా ?

Posted by venditeravaartha, May 30, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

నందమూరి తారకరామారావు గారి నట వారసుడు గా ఇండస్ట్రీ లో అడుగు పెట్టి అతి కొద్దీ కాలం లో నే తన కంటూ ప్రత్యకమైన గుర్తింపు తెచ్చుకున్నారు బాలకృష్ణ(Balakrishna).తన సహా నటులు అయినా చిరంజీవి ,నాగార్జున ,వెంకటేష్ ల తో కలిసి తెలుగు సినిమా ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లిన బాలకృష్ణ 1990 ల లో తిరుగులేని విజయాల తో టాలీవుడ్ లో నెంబర్ ప్లేస్ కి పోటీగా వచ్చాడు .1999 ,2001 ల లో రిలీజ్ అయినా సమరసింహారెడ్డి ,నరసింహనాయుడు సినిమా ల తో టాప్ లోకి వచ్చాడు బాలకృష్ణ.ఇక అదే సమయం లో తెలుగు ఇండస్ట్రీ లోకి స్టూడెంట్ no1 సినిమా తో ఎంట్రీ ఇచ్చారు రాజమౌళి.స్టూడెంట్ స్టోరీ తో తన మొదటి సినిమా చేసి సక్సెస్ అయినా రాజమౌళి తన తదుపరి చిత్రం కోసం మంచి మాస్ యాక్షన్ స్టోరీ రెడీ చేసుకున్నారు.

Balaya rajamouli

బాలకృష్ణ ఇండస్ట్రీ హిట్ సమరసింహా రెడ్డి కి రైటర్ గా పనిచేసిన విజయేంద్రప్రసాద్ తన కొడుకు రాజమౌళి(Rajamouli) కోసం కేరళ బ్యాక్ డ్రాప్ లో మంచి మాస్ యాక్షన్ కథ ని రెడీ చేసాడు..ఆ కథ కోసం పర్సనాలిటీ కలిగిన హీరో సమరసింహారెడ్డి,నరసింహనాయుడు, చెన్నకేశవ రెడ్డి సినిమా ల తో మంచి సక్సెస్ మీద ఉన్న బాలకృష్ణ ని కలిశారు.అయితే ఇది రాజమౌళి కి రెండవ సినిమా మాత్రమే కావడం తో ఇంత పెద్ద కథ ని రాజమౌళి డీల్ చేస్తాడా చేయగలడా అనే సందేహం తో బాలకృష్ణ ఈ సినిమా ని రిజెక్ట్ చేసాడు.

Ntr

ఆ తర్వాత రాజమౌళి ,విజయేంద్ర ప్రసాద్ గార్లు అదే కథ కి కొన్ని మార్పులు చేసి జూనియర్ ఎన్టీఆర్ తో సింహాద్రి(Simhadri) చేసారు.2003 జులై 9 న రిలీజ్ అయినా సింహాద్రి మూవీ ఇంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే.ఈ సినిమా తో జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరో రేంజ్ కి ఎదగడమే కాకుండా అప్పటి స్టార్ హీరో ల కి సైతం సవాలు విసిరాడు అనే చెప్పాలి.ఇక సింహాద్రి ని మిస్ చేసుకున్న బాలకృష్ణ ఆ తర్వాత రాజమౌళి తో సినిమా చేయాలి అని చాల సార్లు అనుకున్న అది జరగలేదు.మరి తనని తక్కువ గా చూసినందుకు రాజమౌళి బాలయ్య మీద కోపం తోనే తనతో సినిమా చేయడానికి సిద్ధంగా లేడు అనేది బయట ఉన్న సమాచారం.

nbk ntr ssr

597 views