టాలీవుడ్ లో హైయెస్ట్ ఫ్యాన్ బేస్ కలిగిన హీరో ల లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,మహేష్ బాబు ఉన్నారు.అయితే సింపుల్ గా ఉండే వీరు ఇద్దరు మొదట నుంచి స్నేహభావం తోనే ఉన్నారు.
మహేష్ బాబు అర్జున్ సినిమా పైరసీ విషయం లో పవన్ కళ్యాణ్(Pawan kalyan) సపోర్ట్ చేయడం తో వీరి మధ్య బంధం ఇంకా మెరుగైంది అని అంటారు.బయట తరుచు కలవకపోయిన వీరి మధ్య మంచి స్నేహం ఉంది అనేది బయట సమాచారం.అయితే పవన్ కళ్యాణ్ ,మహేష్ బాబు(Mahesh babu) ఇద్దరికీ కూడా కామన్ ఫ్రెండ్ అయినా త్రివిక్రమ్ వీరి ఇద్దరి తోనే మంచి స్నేహం కలిగి ఉంటారు.అందులో మరి ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారితో మంచి అనుబంధం కలిగి ఉంటారు. త్రివిక్రమ్ ఈ స్టార్ హీరో ల లో మొదటగా మహేష్ బాబు తో మొదట తన సినిమా ని చేయాలి అనుకున్నారు,కానీ అంతకు ముందే స్రవంతి రవి కిషోర్ గారికి ఇచ్చిన మాట ప్రకారం నువ్వే నువ్వే సినిమా చేసాక 2005 లో మహేష్ బాబు తో అతడు మూవీ చేసి సూపర్ హిట్ కొట్టారు..
అతడు సినిమా అప్పటి నుంచే మహేష్ తో మంది స్నేహం కలిగి ఉన్న త్రివిక్రమ్(Trivikram). 2008 లో పవన్ కళ్యాణ్ గారి జల్సా(Jalsa) సినిమా తో పవన్ తో తన మొదటి సినిమా ని చేసారు.అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారితో మంచి స్నేహం కలిగి ఉన్న త్రివిక్రమ్ 2010 ఖలేజా సినిమా అయ్యాక అల్లు అర్జున్ తో జులాయి ,పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ ల తర్వాత ఒక భారీ మల్టీ స్టారర్ ని ప్లాన్ చేసారు.అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత త్రివిక్రమ్ మహేష్ ,పవన్ కళ్యాణ్ ల తో కలిసి ఒక భారీ చిత్రాన్ని చేయడానికి ప్లాన్ చేసారు.ఇద్దరు హీరో లు తనకి మంచి ఫ్రెండ్స్ కావడం తో ఇద్దరు కూడా ఈ సినిమా ని చేయడానికి ఒప్పుకున్నారు.
అయితే మహేష్ అప్పుడే వెంకటేష్ గారితో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చేసి టాలీవుడ్ లో మల్టీ స్టార్రర్ ల కి ఓపెనింగ్ చేసాడు,ఇక పవన్ కళ్యాణ్ తో చేయబోయే సినిమా కోసం పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఓకే అనడం తో మూవీ ఇక స్టార్ట్ అవుతుంది అనుకున్నారు.కానీ అప్పుడే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ని ఏర్పాటు చేయడం,2014 ఎలక్షన్స్ తో బిజీ కావడం తో ఈ సినిమా కి బ్రేక్ పడింది,అదే సమయం లో మహేష్ బాబు నేనొక్కడినే ,ఆగడు సినిమా ల తో నిరాశపరచడం తో త్రివిక్రమ్ ఈ సినిమా ని బ్రేక్ చేసి అల్లు అర్జున్ తో సన్ అఫ్ సత్యమూర్తి ని చేసారు.ఇప్పుడు మహేష్ త్రివిక్రమ్ లు కలిసి మూవీ చేస్తున్నారు ఇక 2024 ఎలక్షన్స్ అయినా తరువాత పవన్ తో త్రివిక్రమ్ మూవీ ఉంటుంది అని సమాచారం.