Chiranjeevi daughter: శ్రీజ మూడోపెళ్లి చేసుకోబోతున్న నటుడు ఎవరో తెలుసా?

Posted by venditeravaartha, June 10, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

మెగాస్టార్ కుటుంబం గురించి చెబితో కొందరికి గూస్ బంప్స్ అవుతాయి. చిరంజీవి, పవన్ కల్యాణ్ లాంటి నటులు సినిమాల్లో తమ నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటారు. వీరే కాకుండా వీరి తరువాతి తరంవారు తమ యాక్టింగ్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే మెగా ఫ్యామిలీ సినీ ఇండస్ట్రీలో ఎంతో సక్సెస్ ఫుల్ గా ఉందో పర్సనల్ విషయాలకొచ్చేసరికి కొన్ని అనుకోని సంఘటనలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా చిరంజీవి ఇద్దరి కూతుళ్ల పెళ్లి విషయం సంచలనంగానే మారింది. తన పెద్ద కూతురుతో హీరో ఉదయ్ కిరణ్ ను ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించారు. కానీ ఆ తరువాత రద్దయింది. చిన్న కూతురు శ్రీజ(Sreeja) ఇప్పటికే రెండు పెళ్లి చేసుకుంది. ఇప్పుడు మూడో వివాహంపై కొత్త న్యూస్ క్రియేట్ అవుతోంది.

sreeja 1st husband

చిరంజీవి(Chiranjeevi) చిన్న కూతురు శ్రీజ మొదట్లో శిరీష్ భరద్వాజ్ ను పెళ్లి చేసుకుంది. అప్పట్లో వీరి పెళ్లిని ఒప్పుకోకపోవడంతో ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకున్నారు. తల్లిదండ్రుల నుంచి తమకు రక్షణ లేదని పోలీస్ స్టేషన్ ను కూడా ఆశ్రయించారు. అయితే ఆ తరువాత చిరంజీవి ఫ్యామిలీ వారి గురించి పట్టించుకోలేదు. కొంతకాలం వీరు కాపురం చేశారు. వీరికి ఓ బాబు కూడా జన్మించారు. అనుకోని కారణాల వల్ల వీరు విడిపోవాల్సి వచ్చింది.

kalyan dev

కూతురు స్థితిని చూసిన చిరంజీవి ఆమెను ఇంటికి తీసకొచ్చారు. ఆ తరువాత కళ్యాణ్ దేవ్(Kalyan dev) తో వైభవంగా పెళ్లి చేశారు. వీరికీ ఓ పాప జన్మించింది. వీరు కూడా కొంతకాలం హాయిగానే గడిపారు. అయితే వీరూ కూడా ఎక్కువరోజులు కలిసి ఉండలేకపోయినట్లు తెలుస్తోంది. శ్రీజ తన సోషల్ మీడియా ఖాతాలో శ్రీజ కల్యాణ్ దేవ్ నుంచి శ్రీజ కొణిదెలగా మార్చుకుంది. దీంతో కల్యాణ్ దేవ్ తో ఆమె విడిపోయిందని అంటున్నారు. కానీ అధికారికంగా ప్రకటించలేదు.

sreeja chiru kalyan dev

ఇంతలో శ్రీజ తన మాజీ భాయ్ ఫ్రెండ్ తో మూడో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. త్వరలో వీరు పెళ్లి చేసుకుంటారని అంటున్నారు. అయితే తన భాయ్ ఫ్రెండ్ సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తేనని సమాచారం. ఆయనతో ప్రస్తుతం కాంటాక్ట్ లో ఉందని వీరిద్దరు ఒక్కటవుతారని అంటున్నారు. అయితే చిరంజీవి ఈ విషయంలో ఎలాంటి రెస్పాన్స్ చెందడం లేదు. అనుకున్నట్లుగానే శ్రీజ మూడో పెళ్లి చేసుకుంటుందా? లేదా? అనేది చూడాలి.

2385 views