అక్కినేని నాగార్జున(Nagarjuna) సినిమా కెరీర్ లో మన్మధుడు(Manmadhudu) సినిమా కి చాల ప్రత్యేకత ఉంది.త్రివిక్రమ్ కథ మాటలు అందించిన ఈ సినిమా కి విజయ్ భాస్కర్ గారు డైరెక్టర్.దేవి శ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ సినిమా కి హైలైట్ గా నిలిచింది. మన్మధుడు సినిమా కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా నంది అవార్డు ల ని గెలుచుకుంది.ఇక సినిమా ద్వారా నాగార్జున గారి కెరీర్ పీక్ స్టేజి కి వెల్లింది అనే చెప్పాలి.మన్మధుడు సినిమా లో నాగార్జున తో పాటు సోనాలిబింద్రే,అన్షు ప్రధాన పాత్రలు గా చేసారు.మెయిన్ లీడ్ సోనాలి బింద్రే అయినప్పటికీ సెకండ్ హాఫ్ లో అన్షు క్యారెక్టర్ మీదనే బేస్ అయి ఉంటుంది.
లండన్ లో పుట్టిన అన్షు(Anshu) అక్కడే తన స్టడీస్ ని పూర్తి చేసుకున్నారు.అయితే తనకి తెలిసిన వాళ్ళ ద్వారా డైరెక్టర్ విజయ భాస్కర్ ని కలవడం తో మన్మధుడు సినిమా లో అవకాశం లభించింది.మహేశ్వరీ అనే క్యారెక్టర్ లో క్యూట్ లుక్స్ మరియు అందం తో అప్పటి కుర్రాళ్ల కి ఫేవరేట్ గా మారింది.మన్మధుడు లో తన నటన కి గాను బెస్ట్ సపోర్ట్ రోల్ లో ఫిలిం ఫేర్ అవార్డు కూడా గెలుచుకున్నారు.ఇక తన రెండవ సినిమా ప్రభాస్ గారితో రాఘవేంద్ర(Raghavendra) సినిమా లో మెయిన్ హీరోయిన్ గా చేసారు.ఇక్కడ ఆశ్చర్యం ఏంటి అంటే తెలుగు లో ఆమె చేసింది ఈ రెండు సినిమా ల లో రెండు సినిమా ల లోను తన క్యారెక్టర్ చనిపోతుంది.రాఘవేంద్ర మూవీ తర్వాత ఒక్క తమిళ్ మూవీ లో నటించిన అన్షు..2003 లో లండన్ లోని సచిన్ సాగర్ అనే బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకుని సినిమా ల నుంచి దూరమయ్యారు.
అన్షు ప్రస్తుతం తన ఫ్యామిలీ తో లండన్ లో జీవిస్తున్నారు,తనకి ఒక కూతురు ,కొడుకు ఉన్నారు ,సినిమా ల నుంచి దూరమైన అన్షు ‘ఇన్‌స్పిరేషన్ కోచర్’ అనే క్లాతింగ్ బిజినెస్ చేస్తోంది.అయితే తాను మరల సినిమా ల లోకి రీ ఎంట్రీ ఇస్తే బ్రేక్ ఇచ్చేందుకు మన టాలీవుడ్ డైరెక్టర్ లు రెడీ గా ఉన్నారు, మన్మథుడు చిత్రంతో తెలుగు వారి మదిని దోచిన అన్షు ఇప్పుడు లండన్‌లో ఇలా స్థిరపడిందన్నమాట. అయితే వెండి తెరకు ఇన్నేళ్లు దూరంగా ఉన్నా అన్షు అందం ఏమాత్రం తగ్గకపోవడం విశేషం.