బొంబాయి సినిమా సినిమాలోని సాంగ్స్ వింటే ఇప్పటికీ మనసు కల్లోలంగా మారుతుంది. ఆ పాటలతో పాటు అందులో నటించిన హీరో అరవింద స్వామి కూడా ఫేమస్ అయ్యారు. బొమ్మ గీసినట్లుగా మొగాళ్లు కూడా ఎంతో అందంగా ఉంటారని అరవింద స్వామిని చూస్తే అర్థమవుతుంది. అంతేకాకుండా చాలా మంది మొగాళ్లను అందం విషయం మాట్లాడేటప్పుడు అరవింద స్వామినే గుర్తు చేసుకుంటారు. అయితే అరవిందస్వామి కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరమై.. సెకండ్ ఇన్నింగ్స్ లో అదరగొడుతున్నాడు. స్టైలిష్ విలన్ గా నటిస్తూ ఆకట్టుకుంటున్నాడు. అయితే లేటేస్టుగా ఆయన ఆస్తుల విషయం చర్చకు వచ్చింది. ఇంతకు ఆయన ఆస్తులు ఎన్ని కోట్లో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
అరవింద స్వామి 1970 జూన్ 30న చెన్నైలో జన్మించాడు. అతని తండ్రి పారిశ్రామిక వేత్త వి డి స్వామి. 1990లో డిగ్రీ పూర్తి చేసిన ఆయన ఆ తరువాత అమెరికాలోని నార్త్ కరోలినా లోన మాస్టర్ డిగ్రీ చేశాడు. వాస్తవానికి అరవింద్ స్వామి డాక్టర్ కావాలని అనుకున్నాడు. కానీ పాకెట్ మనీ కోసం అప్పుడప్పడు అడ్వర్టయిజ్మెంట్లు చేస్తుండేవాడు. ఇలా అరవింద స్వామి మణిరత్నం కంట్లో పడ్డాడు. తనను ఓసారి కలవమని చెప్పి అతనితో బొంబాయి సినిమా తీశాడు. ఆ తరువాత రోజా తో పాటు మరికొన్ని చిత్రాల్లో నటించాడు. సినీ కెరీర్ మంచి పొజిషన్లో ఉన్నప్పుడే అరవింద స్వామి బిజినెస్ రంగంలో అడుగుపెట్టాడు. ఆయన సొంతంగా 2005లో Talent Maximus అనే సంస్థను స్థాపించాడు. ఇది కన్సల్టెంటీ సంస్థ. తాత్కాలికంగా పలువురికి ఉద్యోగాలు ఈ సంస్థ కల్పిస్తుంది.
దీని ద్వారా చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారు. అలా ఈ సంస్థ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. సినిమాల్లో అవకాశాలు లేకపోవడంతో కొన్నాళ్లపాటు ఇదే బిజినెస్ లో బిజీ అయిపోయాడు. అయితే 2013లో ‘కాదల్’ అనే సినిమా కోసం మరోసారి ఆయనకు పిలుపు వచ్చింది. అలా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఆ తరువాత ‘తని ఓరువన్’ అనే చిత్రంలో విలన్ గా నటించాడు. ఈ సినిమా సక్సెస్ కావడంతో దీనిని తెలుగులో ‘ధ్రువ’ పేరుతో రీమేక్ చేశారు. ఇక్కడా అరవింద స్వామి తన విలనిజంతో మెప్పించాడు. ఇలా రెండు రకాలుగా అరవింద్ స్వామి డబ్బు బాగానే సంపాదించాడు. తండ్రి ఇచ్చిన ఆస్తులతో పాటు అరవింద స్వామి సంపాదించిన ఆస్తులు మొత్తం ఆయనకు రూ.4000 కోట్లు ఉన్నట్లు సమాచారం. తెలుగులో స్టార్ హీరోలను మించి అరవింద స్వామికి ఉండడంతో ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.