Bro Movie: బ్రో హిట్ అవ్వాలి అంటే ఎంత కలెక్ట్ చేయాలో తెలుసా ?

Posted by venditeravaartha, July 26, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో మూవీ జులై 28 న ప్రపంచ వ్యాప్తముగా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే అయితే తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయినా వినోదయ సీతం సినిమా కి రీమేక్ అయినా బ్రో ని సముద్ర ఖని గారు డైరెక్షన్ చేయగా స్క్రీన్ ప్లే ,మాటలు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అందించారు.వరుస బ్లాక్ బస్టర్ ల తో ఉన్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు నిర్మిస్తున్న ఈ చిత్రం కి మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీత దర్శకులు గా చేసారు.ఇక ఇప్పటికే రిలీజ్ అయినా టీజర్ ,సాంగ్స్ ,ట్రైలర్ ల తో హైప్ ఇచ్చిన ఈ సినిమా జులై 28 న అభిమానుల కి పండగ ని తీసుకురానుంది.

bro

అజ్ఞాత వాసి సినిమా తర్వాత మూడు సంవత్సరాలు బ్రేక్ తీసుకుని ఆ తర్వాత చేసిన సినిమా లు వకీల్ సాబ్ ,బీమ్లా నాయక్ లు కమర్షియల్ గా మంచి సక్సెస్ నే సాధించినప్పటికీ ఆంధ్ర లో తగ్గించిన టికెట్ రేట్లు ,బెనిఫిట్ షో లు లేకపోవడం తో నిర్మాతలకి కొంత నష్టం వచ్చింది.
ఇక ఇప్పుడు రాబోతున్న బ్రో సినిమా కి సైతం టికెట్ రేట్లు పెంపు లేకపోవడం ,బెనిఫిట్ షో లు లేకపోవడం తో మొదటి రోజు కలెక్షన్ కి కొంత బ్రేక్ పడేలా ఉంది.అయితే తాము లిమిటెడ్ బడ్జెట్ లోనే సినిమా ని పూర్తి చేసాము అని చెప్తున్నారు ప్రొడ్యూసర్స్.ఇక రిలీజ్ కి రెడీ కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది ,బ్రేక్ ఈవెన్ ఎంతో ఇప్పుడు చూద్దాం.

pk and sdt

నైజాం:30 కోట్లు
సీడెడ్:13 .50 కోట్లు
ఉత్తరాంధ్ర:9 .50 కోట్లు
ఈస్ట్:6 .40 కోట్లు
వెస్ట్:5 .60 కోట్లు
గుంటూరు:7 .50 కోట్లు
కృష్ణ:5 .30 కోట్లు
నెల్లూరు:3 .50 కోట్లు
కర్ణాటక +రెస్ట్ :5 కోట్లు
ఓవర్సీస్ :12 కోట్లు
టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్:98 .30 కోట్లు

బ్రో సినిమా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 100 కోట్లు కలెక్ట్ చేయాలి..తక్కువ టికెట్ రేట్లు ,బెనిఫిట్ షో లు లేకుండా 100 కోట్లు కలెక్షన్ సాధించాలి అంటే మొదట వారం వసూళ్లు మీదనే సినిమా ఆధారపడి ఉంటుంది.ఈ సంవత్సరం విరూపాక్ష తో 100 కోట్లు సాధించిన సాయి తేజ్ బ్రో సినిమా తో మరో 100 కోట్ల హీరో గా మారనున్నారా.

 

980 views