నందమూరి తారకరత్న అంటే తెలియని వారు ఉండరు నందమూరి అంటేనే యన్ టి ఆర్ ఘంబిర్యం కనిపిస్తుంది. నందమూరి యువ హీరోస్ లో తారకరత్న తక్కువ మంది కి పరిచయం గత కొన్ని రోజులుగా గుండెపోటు తో బాధపడుతున్న తారకరత్న ఫిబ్రవరి 18 శనివారం రోజున మరణించారు. అయితే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, రాజకీయవేత్తలు అందరూ కూడా హాస్పిటల్ నుండి కోలుకొని తిరిగి వస్తారు అనే ఆశతో ఎరుచూస్తున్నారు అటువంటి సమయం లో హఠాత్తుగా ఆయన మరణం నందమూరి, నారా కుటుంబసభ్యుల లో విషాదం నింపింది. నందమూరి తారకరత్న ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లో ఒకేసారి 9 సినిమా ప్రాజెక్ట్స్ కి సంతకం చేశారు ఒకేసారి ఇన్ని సినిమాలకు అవకాశం రావటం సంతకం చేయటం అనేది నేటి వరకు ఏ హీరో కి సాధ్యపడలేదు.
![](http://venditeravaartha.com/wp-content/uploads/2023/02/balakrishna-2-1024x576.jpg)
ఇటువంటి ఘనత తారకరత్న కు ఉన్నప్పటికీ హీరో గా మంచి స్థానం గుర్తింపు సొంతం చేసుకోలేక పోయారు కానీ వ్యక్తిగతంగా ఎందరి హృదయాల్లో నిలిచిపోయారు. తారకరత్న అలెక్య రెడ్డి ప్రేమ వివాహం చేసుకున్నారు వీరికి ముగ్గురు సంతానం మొదట ఒక కుమార్తె తరువాత కవలలు ఒక కుమార్తె ఒక కుమారుడు జన్మించారు తారకరత్న తన తాత మీద ప్రేమ తో ముగ్గురు పిల్లల పేర్లలో తాతా పేరు వచ్చేలా పెట్టుకున్నారు మొదటి కుమార్తె పేరు నిషిక, కుమారుని పేరు తనయ రామ్, రెండవ కుమార్తె పేరు రేయ, ఈ విధంగా పిల్లల పేర్ల మొదటి అక్షరం తో తాతా పేరు ఎన్టీఆర్ అని అర్ధం వచ్చేలా పెట్టుకున్నారు. ఇది ఇలా ఉండగా బాలకృష్ణ ఈ పిల్లలతో కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తారకరత్న 39 సంవత్సరాలకే ఈ లోకాన్ని వదిలి వెళ్లటం ఎంతో బాధాకరమైన విషయం గా మారింది.
![](http://venditeravaartha.com/wp-content/uploads/2023/02/balakrishna-1-1024x576.jpg)
ఇక బలకృష్ణ విషయానికి వస్తే అందరికి తెలిసిన విశ్యమే అయన మనసు కూడా చాల మంచిది అని అందరూ అంటారు అయన తారక రత్న పిల్లలకు స్వయంగా పూర్తి బాధ్యత తీసుకొన్నట్లు చెబుతున్నారు అంతే కాదు వాళ్ళకి తన ఆస్థి లోనుంచి తక్షణమే వారి చదువులకి అన్ని విధాలా సహాయం అందేలా చుడనున్నట్లు సమాచారం ఇక పిల్లలు అయితే ఆర్ధికంగా ఏ ఇబ్బందులు లేకపోయినా తండ్రిని కోల్పవటం అంటే మాటలు కాదు అని చెప్పాలి ఆ భగవంతుడు వారి కుటుంబానికి భరోసా ఇవ్వాలని కోరుకుందాం.