Actress: పెళ్లయి..పిల్లలున్న హీరోలతో ఎఫైర్ నడిపిన స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

Posted by venditeravaartha, June 3, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

సినిమా పరిశ్రమలో పనిచేసేవారిపై ఎక్కువగా రూమర్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. వెండితెరపై కాస్త సన్నిహితంగా ఉండే వారి మధ్య ఏదో ఉందంటూ కొందరు వార్తలు సృష్టిస్తారు. అయితే నిప్పులేనిదే పొగరాదు అన్న సామెత ఇక్కడ బాగా పనిచేస్తుంది. విమర్శలు ఎదుర్కున్నవారు మొదటగా ఏం లేదు.. అని ఆ తరువాత వాటిని నిజం చేస్తారు. ఇలాంటివి హీరో, హీరోయిన్ల మధ్య ఎక్కువగా సాగుతుంటాయి. అయితే సౌత్ ఇండస్ట్రీలో పాపులర్ అయిన కొందరు స్టార్ హీరోయిన్లు ఏకంగా పెళ్లయిన హీరోలతో సంబంధం పెట్టుకున్నారు. ఇలాంటి వార్తల్లో కొన్ని నిజం కాగా.. మరికొన్ని ఫేక్ అని తేలాయి. అవేవో తెలుసుకుందాం..

nayanatara

సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుంది నయనతార(Nayanatara). సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ సినిమాతో తెలుగుతెరకు పరిచయం అయిన నయనతార ‘గజిని’తో ఫేమస్ అయింది. ఆ తరువాత తెలుగు, తమిళం, మలయాళంలో నటించిన ఈ భామ సౌత్ సూపర్ స్టార్ హీరోయిన్లలో ఒకరు. ఈ క్రమంలో ఆమె పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్న హీరో ప్రభుదేవా(Prabhudeva)తో ఎఫైర్ పెట్టుకుంది. ముందుగా కొన్నాళ్ల పాటు వీరిద్దరి మధ్య ఏదో ఉందని వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ అబద్దాలే అని కొట్టిపారేసిన నయనతార.. ఆయనను పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అయింది. అయితే కొన్ని కారణాల వల్ల వీరు విడిపోయారు.

anushka nag

‘బాహుబలి’ సినిమాతో వరల్డ్ ఫేమస్ హీరోయిన్ గా మారిపోయిన అనుష్క(Anushka) గురించి తెలియని వారుండరు. ఈ బ్యూటీ ‘సూపర్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఈ సినిమాలో తనను పరిచయం చేసిన అక్కినేని నాగార్జున(Nagarjuna)తో ఆ తరువాత రెండు, మూడు సినిమాల్లో నటించింది. దీంతో వీరిద్దరిమధ్య ఏదో ఉందని కొన్ని రోజుల పాటు వార్తలు వచ్చాయి. అయితే పలుసార్లు నాగార్జునను అనుష్క పొగడడం వల్లే కొందరు వీరి మధ్ ఎఫైర్ సృష్టించారని తెలుస్తోంది.

charmi purijagan

చలాకీగా నటించి గుర్తింపు తెచ్చుకున్న చార్మీ(Charmi) మొదట్లో ఎవరూ గుర్తించలేదు. అయితే కృష్ణవంశీ తీసిన ‘శ్రీ ఆంజనేయం’ సినిమాతో ఛార్మీ ఫేమస్ అయింది. ఆ తరువాతనే ఈమెకు అవకాశాలు పెరిగాయని అంటుంటారు. ఈ క్రమంలో చార్మీ, కృష్ణ వంశీ మధ్య ఏదో ఉందన్న పుకార్లు బయటపడ్డాయి. ఆ తరువాత వీరిద్దరి మధ్య గొడవలు ఉన్నాయని అన్నారు. ఇక ఈమె పూరి జగన్నాథ్(Purijaganadh) తో కలిసి నిర్మాణ సంస్థను నడుపుతుండడంతో వీరిద్దరి మధ్య కొన్ని వార్తలు సృష్టిస్తున్నారు.

vijay sruthihasan

కమలాసన్ కూతురుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతి హాసన్(Sruthi hasan) తెలుగులో కంటే తమిళంలో చాలా సినిమాల్లో నటించింది. ఇళయ దళపతి గా పేరున్న స్టార్ హీరో విజయ్(Vijay) తో ఆమెకు సంబంధాలున్నాయని అన్నారు. అయితే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తో పుకార్లు సృష్టించారు. కానీ ఈమె విదేశీయుడిని పెళ్లి చేసుకోవడం అందరినీ ఆశ్చర్యాన్ని గురిచేసింది.

keerthi nani

మహానటిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్(Keerthi suresh) పైనా కొన్ని వార్తలు బాగా వచ్చాయి. ఈమె పెళ్లయిన ఓ హీరోతో సంబంధం పెట్టుకుందన్న వార్తలు వచ్చాయి. అయితే దీనిపై కీర్త సురేష్ ఏ విధంగానూ స్పందించలేదు. దీంతో ఈ వార్తల్లో నిజం లేదని తేలింది.

2291 views