Brahmanandam: బ్రహ్మానందం చిన్న కోడలు గురించి ఆసక్తికర విషయాలేంటో తెలుసా?

Posted by venditeravaartha, June 3, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

తెలుగు సినిమా లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం(Brahmanandam) దశాబ్దాల తరబడి ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నారు. ఒక సినిమాలో బ్రహ్మనందం ఉన్నాడంటే ఆ సినిమా కచ్చితంగా హిట్టు అవుతుందని కొందరు డైరెక్టర్ల నమ్మకం. అందుకే బ్రహ్మానందం కోసం ప్రత్యేకంగా పాత్రను సృష్టిస్తారు. సినిమాలో బ్రహ్మానందం హీరో కాకపోయినా అంతటి స్థాయిలో నటించిన సినిమాలను హిట్టు చేసిన ఘనత బ్రహ్మానందంది. బ్రహ్మానందం తరువాత ఎంతో మంది కమెడియన్లు వచ్చినా.. ఆయన గుర్తింపు ఇప్పటికీ అలాగే ఉంటుంది.

bramhi

బ్రహ్మానందం తన పర్సనల్ విషయాలు ఎప్పుడూ షేర్ చేసుకోరు. కానీ ఇటీవల ఆయన చిన్న కుమారుడు పెళ్లి సందర్భంగా ఆయనకు సంబంధించిన విషయాలను ఇండస్ట్రీ వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. ఆయన చిన్నకుమారుడు సిద్ధార్థ్-ఐశ్వర్యల నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే సిద్ధార్థ్ చేసుకోబోయే అమ్మాయి గురించి ఆసక్తికర విషయాలపై తీవ్ర చర్చ సాగుతోంది.

brami second son

బ్రహ్మానందంకు కాబోయే కోడలు ఐశ్వర్య గైనకాలజిస్ట్. ఈమె చదువంతా అమెరికాలోనే సాగింది. ఐశ్వర్య తల్లి ఎవరో కాదు. కరీంనగర్ కు చెందిన ప్రముఖ వైద్యురాలు పద్మజ కూతురు. పిల్లలు లేని దంపతులకు ఐవీఎఫ్ ద్వారా వారి కలలను తీర్చే డాక్టర్ గా ఫేమస్ అయ్యారు. తల్లి బాటలోనే ఐశ్వర్య గైనకాలజిస్ట్ గా మారారు. బ్రహ్మానందం చిన్న కుమారుడు సిద్ధార్థ్ అమెరికాలోనే చదువుకున్నారు. అక్కడే వీరిద్దరికి పరిచయం అయినట్లు సమాచారం.

gautham

ఇక బ్రహ్మానందం పెద్ద కుమారుడు గౌతమ్(Gowtham) గురించి మనకు తెలసిందే. ‘పల్లకిలో పెళ్లి కూతురు’ అనే సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. ఆ తరువాత మరో సినిమాలో హీరోగా వచ్చాడు. అయితే పెద్దగా గుర్తింపు రాకపోవడంతో ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నాడు. కానీ బ్రహ్మానందం మాత్రం ఇప్పటికీ అవకాశం వచ్చిన ప్రతీ సినిమాలో నటిస్తున్నాడు. తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు.

1661 views