Rashmika mandana: రష్మిక తో నటించే అవకాశం కొట్టేసిన డీజే టిల్లు

Posted by venditeravaartha, August 3, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న హీరోయిన్ ల లో రష్మిక మందాన ఒకరు,మొదట కన్నడ సినిమా తో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన రష్మిక తెలుగు లో ఛలో మూవీ తో సూపర్ సక్సెస్ ని తర్వాత
వరుస అవకాశాల తో నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు.తెలుగు తో పాటు తమిళ్
కన్నడ ,హిందీ ల లో సినిమా లు చేస్తున్న ఈమె ప్రస్తుతం పాన్ ఇండియన్ సినిమా లు పుష్ప
ఆనిమల్ ల లో నటిస్తూ బిజీ గా ఉన్నారు.అయితే శ్రీ లీల ఎంట్రీ తర్వాత కాస్త కొన్ని సినిమా ల ఛాన్స్ ల ను పోగొట్టుకున్న రష్మిక ఇప్పుడు టాలీవుడ్ లో ఒక యువ హీరో తో నటించే ఛాన్స్ ని ఒకే చేసారు అని సమాచారం వస్తుంది.

rashmika
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు సిద్ధు జొన్నలగడ్డ సరసన నటించేందుకు ఆమె సంతకం చేసినట్లు తెలుస్తోంది. ప్రముఖ ప్రఖ్యాత స్టయిలిష్ట్
నీరజా కోన దర్శకత్వం వహించబోతున్నారు,ఆమెకి ఇదే తొలి చిత్రం కావడం వల్ల ఈ చిత్రం కోసం సిద్దు జొన్నల గడ్డ సహకారం కూడా ఉండబోతుంది అంటున్నారు.అయితే ఇది వరకే కృష్ణ అండ్ హిస్ లీల ,డీజే టిల్లు సినిమా ల లో సిద్దు తన రైటింగ్ లో ఉన్న ప్రావిణ్యం ని చూపించి సక్సెస్ అయినా విషయం తెలిసిందే.ఇక రష్మిక తో రానున్న ఈ సినిమా లో సిద్దు తన లోని రైటర్ ,నటుడు ని పూర్తి స్థాయి లో చూపించనున్నారు.

tillu

ప్రస్తుతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “టిల్లు స్క్వేర్” సీక్వెల్ మేకింగ్‌లో నిమగ్నమై ఉండగా, సిద్ధు జొన్నలగడ్డ ఈసారి ప్రతిభావంతులైన నీరజ కోన దర్శకత్వంలో మరో అద్భుతమైన ప్రాజెక్ట్‌ను దక్కించుకున్నాడు. ఈ చిత్రం రొమాన్స్ మరియు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ యొక్క ప్రత్యేకమైన సమ్మేళనంతో ప్రేక్షకులను ఆకర్షించడానికి సెట్ చేయబడింది, దర్శకురాలిగా నీరజ యొక్క సృజనాత్మక నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది. అసాధారణమైన దృశ్యమాన అనుభూతిని అందించడానికి, ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్‌ను ఈ సినిమా కోసం ఎంపిక చేశారు, ప్రతిభావంతులైన థమన్ ఎస్ సంగీతాన్ని నైపుణ్యంగా రూపొందించారు. ఈ సినిమా ఎడిటింగ్‌ను అనుభవజ్ఞుడైన నిపుణుడు శ్రీకర్ ప్రసాద్ నిర్వహిస్తారు, అతని నైపుణ్యాన్ని జోడించారు.

901 views