Teja : జూనియర్ ఎన్టీఆర్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్ తేజ!

Posted by venditeravaartha, May 28, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

తెలుగు లో ఉన్న చాల మంది డైరెక్టర్ ల కి తేజ కి చాల వ్యత్యాసం ఉంటుంది. కొంత మంది హీరో ల ని సెలెక్ట్ చేసుకుని వారి కోసం కథలు రాస్తారు కానీ తేజ(Teja)  గారు మాత్రం తన కథ కి ఎవరు సెట్ అయితే వారితోనే సినిమా లు చేస్తారు. తన మొదటి సినిమా చిత్రం సినిమా నుంచి రీసెంట్ గా రిలీజ్ కాబోతున్న అహింస సినిమా వరకు కూడా తేజ తన మార్క్ సినిమా తీస్తున్నాడు..చాల వరకు కొత్త వారితోనే సినిమా లు చేసే తేజ గారు స్టార్ హీరో లని నేను డీల్ చేయలేను అందుకే వారితో సినిమా లను చేయలేదు అని తానే స్వయంగా చెప్పారు. కానీ ఆయన చేసిన సినిమా ల లో మహేష్ బాబు నిజం,రానా గారి నేనే రాజు నేనే మంత్రి మినహా అందరు కూడా కొత్త వారితోనే చేసారు.

teja rana

తేజ గారి డైరెక్షన్ లో వచ్చిన చిత్రం(Chitram) ,జయం(Jayam) ,జై ,లక్ష్మి కళ్యాణం సినిమా ల తో ఉదయ్ కిరణ్ , నితిన్ ,నవదీప్ ,కాజల్ లాంటి స్టార్స్ ని తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయం చేసారు తేజ.. మ్యాచో స్టార్ గోపీచంద్ గారికి జయం,నిజం ల లో విల్లన్ క్యారెక్టర్ అవకాశం  ఇవ్వడం తో తనకి యజ్ఞం సినిమా లో అవకాశం లభించింది అని గోపీచంద్ గారు పలు సార్లు చెప్పారు.అయితే స్టార్స్ ని ఇంట్రడ్యూస్ చేసే తేజ గారు ఆ తరువాత స్టార్స్ తో పని చేయకపోవడం అందరికి ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

jayam

సీనియర్ ఎన్టీఆర్ గారి బయోపిక్ ని మొదట తేజ గారే డైరెక్ట్ చేయాల్సి ఉండగా ఆ సినిమా లో కథ తనకి నచ్చలేదు అని ,అందులో మార్పులు చేస్తేనే తాను ఈ ప్రాజెక్ట్ లో ఉంటాను అని బాలయ్య తో విభేదించి ఆ సినిమా నుంచి బయట వచ్చేసారు తేజ.తన అహింస(Ahimsa) సినిమా ప్రొమోషన్ ల లో భాగంగా తనకి ఎవరైనా స్టార్ హీరో ల తో సినిమా చేయాలి అని ఉందా అని అడిగితే పవన్ కళ్యాణ్ తో మంచి స్టైలిష్ కమర్షియల్ సినిమా తీయాలి అని ఉంది అని అలానే ప్రభాస్ గారితో బాహుబలి ని మించే యాక్షన్ సినిమా తీస్తాను అని అన్నారు. ఎన్టీఆర్(Jr.Ntr) తో ఎలాంటి సినిమా చేస్తారు అని అడగక..ఎన్టీఆర్ చాల గొప్ప నటుడు అని ఆయన స్థాయి కి నేను సరిపోను అని అంత టాలెంట్ తనకి ఇంకా రాలేదు అని అన్నారు. అనుభవం కలిగి తన కంటూ ఒక స్టైల్ ఏర్పరుచుకున్న తేజ గారు ఎన్టీఆర్ మీద చేసిన వ్యాఖ్యలు నమ్మడానికి ఆశ్చర్యంగానే ఉన్నాయి.

ntr teja

707 views