Prabhas : రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ది రాజా సాబ్’ కి సంబంధించిన టీజర్ నిన్న విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ ని ఇంత వింటేజ్ లుక్ లో చూసి చాలా కాలం అయ్యిందని, బాహుబలి తర్వాత కేవలం పాన్ ఇండియన్ భారీ బడ్జెట్ సినిమాలను మాత్రమే చేస్తూ వస్తూ, టాలీవుడ్ ఆడియన్స్ నేటివిటీ కి తగ్గ సినిమాలు ప్రభాస్ తియ్యడం లేదని నిన్న మొన్నటి వరకు ఫ్యాన్స్ నుండి కంప్లైంట్ ఉండేది. ఆ కంప్లైంట్ కి సమాధానం గా కేవలం వారి కోసమే ఈ సినిమాని చేసినట్టుగా నిన్న టీజర్ ని చూస్తే క్లారిటీ వచ్చింది.
నిన్న మొన్నటి వరకు కేవలం మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేస్తూ వచ్చిన డైరెక్టర్ మారుతీ, ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి 40 శాతం షూటింగ్ పూర్తి అయ్యిందట. ఈ చిత్రం కామెడీ హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోందని డైరెక్టర్ ఈ టీజర్ లో క్లారిటీ ఇచ్చాడు. అంతే కాకుండా ఏప్రిల్ 10 వ తారీఖున ఈ చిత్రాన్ని విడుదల చెయ్యబోతున్నట్టుగా కూడా అధికారికంగా తెలిపారు. అయితే ఈ టీజర్ లో ఎవ్వరూ గమనించని ఒక సంఘటన ఉంది. టీజర్ లో ఉన్న లొకేషన్ ని బహుశా ఎవరూ గమనించి ఉండరు. ఈ లొకేషన్ లోనే ప్రభాస్ లేటెస్ట్ సెన్సేషన్ కల్కి మూవీ షూటింగ్ చేసారు.
కల్కి చిత్రం లో కాంప్లెక్స్ లో వచ్చే ‘టక టక టక్కర’ అనే పాట మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఆ పాటలో వచ్చే కొన్ని లొకేషన్స్, నిన్న విడుదలైన టీజర్ లో కూడా ఉంది. అంటే కల్కి సినిమా తీస్తున్న రోజునే ‘రాజా సాబ్’ మూవీ సంబంధించిన ఈ చిన్న సన్నివేశం కూడా దాదాపుగా అదే తరహా కాస్ట్యూమ్స్ తో తీసేసారు అన్నమాట. ఒకే ప్రాంతం లో షూటింగ్ కానిచ్చేశారు, అసలు ఆ వీడియో కల్కి సినిమాలో ఉండేదా, లేక వేరే రాజా సాబ్ లోదా అనే అయ్యోమయ్యం లో పడ్డారు ఫ్యాన్స్.
అయితే ఈ టీజర్ లో ప్రభాస్ లుక్స్ ని చూసి మాత్రం అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇది పేరుకి తెలుగు సినిమానే అయ్యినప్పటికీ, గత ప్రభాస్ సినిమాలు లాగానే, ఈ చిత్రం కూడా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ చిత్రం లో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లు గా నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నాడు.