Krish: ఆ క్రేజీ హీరోయిన్ మోజులో పడి డైరెక్టర్ క్రిష్ తన భార్య ని ఇంతలా టార్చర్ చేశాడా?

Posted by venditeravaartha, March 6, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Krish : టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్స్ లో ఒకరు క్రిష్ అలియాస్ జాగర్లమూడి రాధాకృష్ణ. క్రిష్ తీసిన సినిమాలన్నీ హిట్స్ కాకపోయినా క్లాసికల్ మూవీస్ గా నిలిచి అందరి మదిని గెలిచాయి. క్రిష్ తీసిన ప్రతి మూవీ కూడా ఒక అద్భుతమైన అని చెప్పొచ్చు. గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురూం, గౌతమీపుత్ర శాతకర్ణి, ఇలా ప్రతి సినిమా కూడా క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఆణిముత్యాలు. తన విలక్షణ దర్శకత్వం తో తనకంటూ టాలీవుడ్ లో ఒక స్థానం సంపాదించుకున్నాడు క్రిష్.

ప్రస్తుతం క్రిష్ పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు ఈ చిత్రం పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీగా అవడంతో కాస్త బ్రేక్ పడింది షూటింగ్ను ఆగస్టు నుండి మొదలు పెడతారని టాక్ చివరి ఫైట్ షెడ్యూల్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని సమాచారం. ఈ మూవీ కోసం పవర్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. పవర్ స్టార్ అభిమానులు, క్రిష్ మీద ఎంతో నమ్మకంతో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలుస్తుందని, ఎన్నో అంచనాలతో ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. సినిమా మాత్రం ఎప్పటికప్పుడు ఆలస్యం అవుతూనే ఉంది.

ప్రస్తుతం డ్రగ్స్ కేసులో, విచారణ ఎదుర్కొంటున్న క్రిష్ గురించి ఇప్పుడు ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. క్రిష్ వ్యక్తిగత విషయాల గురించి ఎక్కువగా బయటికి రాలేదు కానీ తన భార్యకు పెళ్లి అయిన రెండు సంవత్సరాలకే విడాకులు ఇచ్చిన సంగతి ఇప్పుడు బయటకు వచ్చింది. 2016లో రమ్య వెలగా అనే అమ్మాయితో క్రిష్ కి వివాహం జరిగింది. వీళ్ళ పెళ్లికి చాలామంది సినీ ప్రేమికులు కూడా హాజరయ్యారు ఇక పెళ్లైన సంవత్సరానికే రమ్య క్రిష్ నుండి విడాకులు కోరుకుంది. దీనికి కారణం ఒక స్టార్ హీరోయిన్ అని టాక్ ఆమెతో పెళ్లయిన తర్వాత కూడా క్రిష్ రిలేషన్ కొనసాగించడంతో ఆ విషయం తెలిసిన రమ్య క్రిష్ కు డీవర్స్ ఇచ్చిందని సమాచారం.

712 views