Dil Raju:హీరోయిన్ అనుష్క తో ప్రేమాయణం పై సంచలన వ్యాఖ్యలు చేసిన నిర్మాత దిల్ రాజు!

Posted by venditeravaartha, November 8, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Dil Raju: టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ ప్రొడ్యూసర్ గా ఓ వెలుగు వెలుగుతున్నారు దిల్ రాజు. చేసిన మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టి ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. ఆయన తీసిన సినిమాల్లో దాదాపు 90శాతం సక్సెస్ కలిగి ఉన్న ఏకైక ప్రొడ్యూసర్ దిల్ రాజు. తను గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొంటూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన సినిమాల్లో ఎందుకు ఫ్లాప్ అయిన హీరోయిన్లను తీసుకుంటారో.. ఆ హీరోయిన్ తో తనకున్న సంబంధం గురించి తెలిపారు. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ ఎందుకు ఫ్లాప్ హీరోయిన్లను తీసుకుంటున్నారు అన్న ప్రశ్నకు దిల్ రాజు సమాధానం ఇస్తూ ఆ కథకు తగ్గట్లు వాళ్లు సరిపోతారన్న ఒక్క కారణంతోనే వాళ్లను తీసుకున్నామన్నారు.

భద్ర సినిమాలో మీరా జాస్మిన్, అలాగే బొమ్మరిల్లులో జెనీలియాలను తీసుకున్నామన్నారు. జెనీలియాను తీసుకున్నప్పుడు ఆ అమ్మాయిని ఎందుకు తీసుకున్నారని అందరు అడిగారని.. కానీ ఆ సినిమా విడుదలై హిట్ అయ్యాక తాను పెద్ద హీరోయిన్ అయిపోయిందన్నారు. ఇప్పుడు తననే ప్రతి సినిమాలో కావాలని కోరుతున్నట్లు తెలిపారు. అలాగే వరుసగా మూడు ఫ్లాపులున్న షీలాను బొమ్మరిల్లు సినిమాకు తీసుకోవడం వెనుక ఉన్న సీక్రెట్ రివీల్ చేశారు. దర్శకుడు భాస్కర్ తో చేసిన డిస్కషన్ లో పల్లెటూరు అమ్మాయిలా కనిపించే ఓ హీరోయిన్ కావాలని.. అందుకు తగ్గట్లే తమకు షీలా సూట్ అయిందన్నారు. అందుకే తనను తీసుకున్నామన్నారు. అలాగే యాంకర్ మీరు కథల విషయంలో చాలా ఇన్ వాల్వ్ అవుతారని అడుగగా.. కథల ఎంపిక చాలా ముఖ్యం, కథను ఎంపిక చేసుకున్నాక.. ఏ హీరోతో చేయాలో 3ఆప్షన్స్ పెట్టుకుంటామని.. ఒకరు కుదరకపోతే మరొకరితో ప్రాజెక్ట్ చేస్తామన్నారు.

తాను తీసిన ప్రతీ సినిమా తన కుటుంబం చూస్తుందని చెప్పారు దిల్ రాజు. ఈ క్రమంలోనే ఆ హీరోయిన్ తో మీకు సంబంధం ఏంటి అని ప్రశ్నించింది యాంకర్.. సినిమాలో ఇది సాధారణం అంటూ సీక్రెట్ రివీల్ చేశారు దిల్ రాజు. ఇలాంటి పుకార్లు వస్తూనే ఉంటాయి. కానీ మన పని మనం చేసుకుంటూ వెళ్లిపోవాలని చెప్పుకొచ్చారు. తాను రోజుకు 18గంటలు పని చేస్తానని.. తన పని చేసుకునేందుకే టైం లేదని ఇలాంటి పుకార్లను పట్టించుకునే తీరిక తనకు లేదన్నారు. ఇటు షీలా కూడా గతంతలో దిల్ రాజు తో తనకు ఎలాంటి రిలేషన్ లేదని కొట్టిపారేసింది. షీలా మాట్లాడుతూ…తాను టాలీవుడ్ లో ఎవరితోనూ టచ్ లో లేనని అంది. దిల్ రాజు ని చివరగా అదుర్స్ ఆడియో ఫంక్షన్ లోనే చూసానని అన్నారు. అసలు నా దగ్గర దిల్ రాజు నెంబర్ కూడా లేదని అన్నారామె. నేను గత సంవత్సర కాలంగా యు.కె లో ఉంటున్నాను. తెలుగు పరిశ్రమలో నాకు ప్రత్యేకంగా స్నేహితులంటూ ఎవరూ లేరని చెప్పింది.

Tags :
1676 views