HHVM: ‘హరి హర వీరమల్లు’ టీజర్ లో ఈ చిన్నారి ప్రముఖ స్టార్ హీరోయిన్ కూతురు అనే విషయం ఎవరికైనా తెలుసా?

Posted by venditeravaartha, May 5, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలలో అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. పీరియాడిక్ జానర్ నేపథ్యం లో తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బందిపోటు దొంగగా కనిపించనున్నారు. ఇప్పటికే 70 శాతం కి పైగా షూటింగ్ పూర్తి అయ్యింది. మిగిలిన షూటింగ్ ఎన్నికలు పూర్తి అయిన వెంటనే ప్రారంభం కానుంది. ఎప్పుడో 2021 వ సంవత్సరం లో ప్రారంభమైన ఈ సినిమా అనేక అడ్డంకుల కారణం చేత వాయిదా పడుతూ వచ్చింది.

ఒకానొక సందర్భంలో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది, ఇక ఉండబోదు అనే కామెంట్స్ కూడా వినిపించాయి. వాటి అన్నిటికి చెక్ పెడుతూ ఇటీవలే ఒక టీజర్ ని విడుదల చేసి ఈ ఏడాదిలోనే సినిమాని విడుదల చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. దీంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ చిత్రం నుండి దర్శకులు క్రిష్ తప్పుకున్నట్టుగా, మిగిలిన చిత్రాన్ని ఏఏం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ పూర్తి చేస్తారని మేకర్స్ అధికారిక ప్రకటన చేసారు. ఇది అభిమానులను కాస్త కలవర పెడుతున్న విషయం. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా టీజర్ ప్రారంభం లో ఒక చిన్నారి ని మనమంతా గమనించే ఉంటాము.

ఈ చిన్నారి పేరు అలేఖ్య. ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈమె ప్రముఖ స్టార్ హీరోయిన్ మీనా కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. మీనా కజిన్ కి స్వయానా ఈమె కూతురు అవుతుందట. ఈ చిత్రం ద్వారానే ఆమె సినీ రంగం లోకి అడుగుపెట్టింది. అలాగే మీనా కూతురు కూడా ఇప్పటికే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరో గా నటించిన ‘పోలీసోడు’ అనే చిత్రం లో ఆమె విజయ్ కి కూతురు గా నటించింది. ఇప్పుడు మీనా కుటుంబానికి చెందిన మరో అమ్మాయి కూడా సినిమా ఇండస్ట్రీ లోకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

440 views