Sharukh Khan: షారుఖ్ ఖాన్ ధరించిన ఈ వాచ్ ధరతో ఒక్క సినిమాని నిర్మించొచ్చు తెలుసా!

Posted by venditeravaartha, May 29, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Sharukh Khan: షారుఖ్ ఖాన్ ధరించిన ఈ వాచ్ ధరతో ఒక్క సినిమాని నిర్మించొచ్చు తెలుసా!ఇండియా లెవెల్ లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లిస్ట్ తీస్తే అందులో షారుఖ్ ఖాన్ టాప్ 5 స్థానాల్లో కచ్చితంగా ఉంటాడు, అందులో ఎలాంటి సందేహం లేదు. బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ తర్వాత అంత పెద్ద సూపర్ స్టార్ ఎవరైనా ఉన్నారా అంటే అది షారుఖ్ ఖాన్ మాత్రమే. బాలీవుడ్ పేరు వినపడగానే మనకి గుర్తు వచ్చే వ్యక్తి ఆయన. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి ఈ స్థాయిలో ఎదగడం ప్రతీ ఒక్కరికి స్ఫూర్తి దాయకం అనే చెప్పాలి. 1995 వ సంవత్సరం నుండి , 2010 వ సంవత్సరం వరకు బాలీవుడ్ ని శాసించిన షారుఖ్ ఖాన్, దాదాపుగా 12 ఏళ్ళు గడ్డు కాలం నడిచింది. చేసిన ప్రతీ సినిమా ఫ్లాప్ అవుతూ వచ్చాయి.

2018 తర్వాత 5 ఏళ్ళ సుదీర్ఘ విరామం ఇచ్చేసరికి షారుఖ్ ఖాన్ పని ఇక అయిపోయింది అని అందరూ అనుకున్నారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఆయన పఠాన్ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసాడు. ఈ చిత్రం తర్వాత విడుదలైన జవాన్ చిత్రం కూడా వెయ్యి కోట్ల రూపాయిలు కొల్లగొట్టి బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ ని మించిన సూపర్ స్టార్ ఎవరు లేరు అని నిరూపితమైంది. ఈ రెండు సినిమాల తర్వాత ఆయన నుండి వచ్చిన డుంకీ చిత్రం కూడా కమర్షియల్ గా లాభాలను తెచ్చిపెట్టింది. ఇదంతా పక్కన పెడితే ఈ ఏడాది షారుఖ్ ఖాన్ యజమాని గా వ్యవహరిస్తున్న కోల్ కత్తా నైట్ రైడర్స్ ఐపీఎల్ టీం కప్ కొట్టడం ని చూస్తుంటే షారుఖ్ ఖాన్ కి గోల్డెన్ పీరియడ్ నడుస్తున్నట్టు అర్థం అవుతుంది.

అయితే మొన్న గ్రౌండ్ లో ఆయన ఎంతో ఉత్సాహంగా కనపడుతూ తన టీం తో విజయాన్ని ఎంజాయ్ చేసారు. ఈ సందర్భంగా షారుఖ్ ఖాన్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా లో లీక్ అయ్యాయి. ఈ ఫోటోలలో షారుఖ్ ఖాన్ ధరించిన వాచ్ అందరి దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది. ఈ వాచ్ ధర ఎంత అని సోషల్ మీడియా లో అభిమానులు వెతకడం మొదలు పెట్టగా, దాని ధర సుమారు నాలుగు కోట్ల రూపాయిలు ఉంటుందని టాక్. షారుఖ్ ఖాన్ ప్రత్యేకంగా విదేశాల నుండి ఈ వాచ్ ని తెప్పించుకున్నాడట. ఆయన వాచ్ అమ్మితే మీ బ్యాచ్ సెటిల్ అయిపోతుంది అని పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది చిత్రం లో ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ కి దగ్గరగా ఇది సూట్ అయిపోతుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Tags :
635 views