Shayaji Shinde:ఈ విలన్ భార్య ఒక పాపులర్ హీరోయిన్ అనే విషయం ఎవరికైనా తెలుసా..?

Posted by venditeravaartha, May 2, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Shayaji Shinde: మన చిన్న తనం నుండి సినిమాల్లో చూస్తూ పెరిగిన విలన్స్ లో ఒకరు షియాజీ షిండే. ఈయన మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘ఠాగూర్’ సినిమా ద్వారా మన ఇండస్ట్రీ కి తొలిసారిగా పరిచయం అయ్యారు. ఆ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో షియాజీ షిండే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా క్రేజీ స్టార్ హీరోల సినిమాల్లో విలన్ గా, క్యారక్టర్ ఆర్టిస్టు గా, కమెడియన్ గా, కామెడీ విలన్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. రెండు సంవత్సరాల క్రితం ఈయన లేని సినిమా అంటూ ఉండేది కాదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆ స్థాయి స్టార్ ఇమేజి ని సంపాదించుకున్నారాయన.

టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వకముందు షిండే హిందీ, మరాఠీ చిత్రాలలో నటించి బాగా ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత దక్షిణాదిన పాపులరై, హాలీవుడ్ లో కూడా సినిమా చేసే అవకాశం దక్కింది అంటే షిండే రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. వచ్చి రాని తెలుగుతో ఆయన పలికే డైలాగ్స్ కి మన టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు. సినిమాల్లోకి రాకముందు షిండే ఎన్నో కష్టాలు పడ్డారు. ఒకానొక దశలో ఆయన వాచ్ మెన్ గా కూడా పని చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ స్థాయి నుండి ఈ స్థాయికి వచ్చిన షిండే జీవితం ప్రతీ ఒక్కరికీ ఆదర్శమే. అయితే ప్రతీ ఏడాది చేతిలో డజనుకు పైగా సినిమాలతో ఫుల్ బిజీ గా ఉండే షిండే ఈమధ్య కాలంలో సినిమాలకు దూరం అయ్యారు.

అందుకు కారణం ఆయనకి ఉన్న ఆరోగ్య సమస్యలే. ఇటీవలే ఆయనకీ గుండెపోటు రావడం తో ఆసుపత్రికి తీసుకెళ్లి అత్యవసర చికిత్స చేయించాల్సిన అవసరం వచ్చింది. ఇదంతా పక్కన పెడితే షియాజీ షిండే భార్య, పిల్లలు ఎవరు?, ఇప్పుడు ఎలా ఉన్నారు , ఏమి చేస్తున్నారు అనే సందేహం మీలో ఎప్పుడైనా కలిగి ఉండొచ్చు. షిండే వందన షిండే అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈమె ఎవరో అనుకునేరు, ఈమె కూడా సినీ ఇండస్ట్రీ కి చెందిన ఆమెనే. ఈమె నటించిన ఎన్నో మరాఠీ చిత్రాలలో షిండే కూడా నటించారు. అలా వీళ్లిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం, ప్రేమగా మారి, వివాహ బంధానికి దారి తీసింది. ఈ ఇద్దరి దంపతులకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. షిండే కుటుంబానికి సంబంధించిన ఫోటోలు కొన్ని క్రింద అందిస్తున్నాము చూడండి.

Tags :
256 views