Genelia: హీరోయిన్ జెనీలియా బాలనటిగా నటించిన చిరంజీవి సినిమా అదేనా..?

Posted by venditeravaartha, May 7, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Chiranjeevi: బాలనటులుగా రాణించి ఇండస్ట్రీ లో తిరుగులేని సూపర్ స్టార్స్ గా ఎదిగిన వారు ఎంతో మంది ఉన్నారు. పేర్లు ప్రత్యేకించి చెప్పకపోయినా వాళ్లెవరో అందరికీ తెలుసు. అయితే కొంతమంది మాత్రం అసలు బాలనటులుగా నటించారని విషయం కూడా తెలియదు. కొన్నాళ్ల తర్వాత ఆ విషయం తెలుసుకొని ఆశ్చర్యపోయిన సందర్భాలు మనకి ఎన్నోసార్లు అనుభవం అయ్యి ఉంటాయి. అలాంటి అనుభవమే ఇప్పుడు మేము చెప్పబోయే విషయం లో కూడా కలుగుతుంది. తన అందం , అభినయం తో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకొని, బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా ఎదిగి పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్ స్టేటస్ ని దక్కించుకున్న జెనీలియా ఒకప్పుడు బాలీవుడ్ లో బాలనటిగా పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిందట. మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ఆల్ టైం క్లాసిక్ చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాని అంత తేలికగా ఎవ్వరైనా మర్చిపోగలరా..?.

ఈ సినిమాలో చిన్నారిగా నటించిన షాలిని ముద్దులొలికే మాటలతో రాజు అని పిలిచిన పిలుపులను ఇప్పటికీ మరచిపోలేము. పెద్ద అయ్యాక ఈమె ‘ఓయ్’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అయితే ఈమె పాత్ర కోసం తొలుత జెనీలియా ని తీసుకున్నారట డైరెక్టర్ రాఘవేంద్ర రావు. కొన్ని రోజులు షూటింగ్ జరిగిన తర్వాత జెనీలియా కి విపరీతమైన జ్వరం రావడం తో, ఆమె తల్లి మధ్యలోనే షూటింగ్ ని రద్దు చేయించి తీసుకెళ్ళిపోయింది. దీంతో ఆ తర్వాత షాలిని సోదరి షామిలి ని తీసుకున్నారు.

ఆమెకి ఈ పాత్ర ద్వారా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. వీళ్లిద్దరి వయస్సు కూడా ఒక్కటే అవ్వడం మరో విశేషం. ఇకపోతే జెనీలియా ప్రముఖ బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ని ప్రేమించి పెళ్లాడిన సంగతి అందరికీ తెలిసిందే. చాలా కాలం వరకు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన జెనీలియా ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది. రీ ఎంట్రీ లో ఆమె తన భర్త తో కలిసి చేసిన ‘మజిలీ’ హిందీ రీమేక్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. ఈ సినిమా తర్వాత ఆమెకి మరిన్ని అవకాశాలు వస్తున్నాయి.

568 views