Charmy Kaur:హీరోయిన్ ఛార్మీ బాలనటిగా నటించిన వెంకటేష్ సినిమా అదేనా..?

Posted by venditeravaartha, May 2, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Heroine Charmy: టాలీవుడ్ లో అందంతో పాటుగా అద్భుతమైన అభినయం కనబర్చే హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో ఛార్మీ ముందు వరుసలో ఉంటుంది. మిగిలిన స్టార్ హీరోయిన్స్ తో పోలిస్తే ఈమె పెద్ద రేంజ్ కి వెళ్లలేకపోయింది కానీ, ఆడియన్స్ లో ఈమెకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని మాత్రం తెచ్చుకుంది. నీ తోడు కావాలి అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ లో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఆమె తమిళం, హిందీ, మలయాళం ఇండస్ట్రీస్ లో పలు చిత్రాలు చేసి, మళ్ళీ తెలుగులో ‘నీకే మనసిచ్చాను’ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు, ఇక ఆ తర్వాత ఈమెకి నితిన్ – కృష్ణవంశీ కాంబినేషన్ లో వచ్చిన ‘శ్రీ ఆంజనేయం’ చిత్రం లో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కింది.

అప్పట్లో ఈ సినిమాలో ఈమె అందాల ఆరబోత, మితిమీరిన రొమాన్స్ కారణంగా తీవ్రమైన విమర్శలు ఎదురుకోవాల్సి వచ్చింది. సినిమా ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా ఛార్మీ కి మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమా తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ ఫుల్ బిజీ అయ్యింది. కానీ సక్సెస్ శాతం చాలా తక్కువ. సీనియర్ హీరోలలో ఈమె చిరంజీవి తో మినహా బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లతో కలిసి నటించింది. ఇక నేటి తరం స్టార్ హీరోలలో ప్రభాస్, ఎన్టీఆర్ లతో మాత్రమే సినిమాలు చేసింది. ఆ తర్వాత ఈమె అత్యధికంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ వచ్చింది.

ఇదంతా పక్కన పెడితే ఛార్మీ కి సంబంధించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయం ఒకటి తెలిసింది. అదేమిటంటే ఈమె బాల్యం లో కూడా పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిందట. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో అత్యధికంగా ఈమె బాలనటిగా నటించినట్టు తెలుస్తుంది. తెలుగు లో ఈమె విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ‘సుందరాకాండా’ చిత్రం లో ఒక సన్నివేశం లో రెండు నిమిషాల పాటు బాలనటిగా నటించిందట. వెంకటేష్ సినిమాలో బాలనటిగా నటించి మళ్ళీ అదే వెంకటేష్ హీరో గా నటించిన ‘లక్ష్మీ’ చిత్రం లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది ఛార్మీ. గతం లో శ్రీదేవి కి ఇలాగే జరిగింది. ఆమె ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు చిత్రాలలో బాలనటిగా నటించింది. మళ్ళీ పెద్దయ్యాక వాళ్ళ సినిమాల్లోనే హీరోయిన్ గా కూడా నటించింది. అలాంటి అరుదైన సంఘటన నేటి తరం హీరోయిన్స్ లో ఒక్క ఛార్మీ కి మాత్రమే దక్కింది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

428 views