Baby : ‘బేబీ’ చిత్రం లో హీరోయిన్ గా నటించమంటే ‘ఛీ’ కొట్టి తరిమేసిన స్టార్ హీరోయిన్ ఆమేనా?

Posted by venditeravaartha, October 3, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ఇండస్ట్రీ లో చిన్న డైరెక్టర్స్ అంటే పెద్ద హీరోలకు మరియు హీరోయిన్లకు కాస్త చిన్న చూపు ఉండే సంగతి మన అందరికీ తెలిసిందే. కనీసం వాళ్లకి కథలు వివరించే సమయం కూడా ఇవ్వరు. అంత చులకన భావం తో చూస్తూ ఉంటారు, అలాంటి అనుభవం ‘బేబీ’ మూవీ డైరెక్టర్ సాయి రాజేష్ కి ఎదురు అయ్యింది. ఈ సినిమా కోసం తొలుత ఆయన ప్రముఖ యంగ్ హీరో విశ్వక్ సేన్ ని సంప్రదించారట. ఆయన మ్యానేజర్ కి కాల్ చేసి ఇలా ఒక స్టోరీ ఉంది, న్యారేట్ చేసే అవకాశం ఇస్తారా అని అడిగినప్పుడు, విశ్వక్ సేన్ ఆ డైరెక్టర్ అయితే నేను సినిమా సచ్చినా చెయ్యను అని చెప్పాడట. ఈ విషయం స్వయంగా సాయి రాజేష్ బేబీ సక్సెస్ మీట్ లో విశ్వక్ సేన్ పేరు ప్రస్తావించకుండా, పరోక్షంగా చెప్పాడు. దీనికి విశ్వక్ సేన్ కూడా సోషల్ మీడియా ద్వారా పరోక్షంగా కౌంటర్లు ఇచ్చాడు.

కేవలం విశ్వక్ సేన్ మాత్రమే కాదు, రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ క్యారక్టర్ లో నటించడానికి నో చెప్పింది అట. కనీసం కలిసి కథ వినిపించే ఛాన్స్ కూడా కల్పించలేదట. ఇలా ఇంత మంది చిన్న చూపు చూసిన ఈ సినిమా, నేడు ఇండస్ట్రీ ని షేక్ చేసింది. స్టార్ హీరోలకు సైతం రాని లాంగ్ రన్ ని సొంతం చేసుకుంది. ‘వాల్తేరు వీరయ్య’ సినిమా తర్వాత ఈ ఏడాది అత్యధిక వసూళ్లు మరియు లాభాలు రాబట్టిన సినిమా ఇదే. ఈ చిత్రం తర్వాత హీరోయిన్ వైష్ణవి చైతన్య కి ఒక సరికొత్త కెరీర్ వచ్చింది. అలాగే విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కి కెరీర్ ని మలుపు తిప్పే సినిమా అయ్యింది. ఈ చిత్రం తో ఆనంద్ దేవరకొండ యాక్టింగ్ స్కిల్స్ ని కూడా బాగా పెంచుకున్నాడు. ఇక డైరెక్టర్ గా సాయి రాజేష్ ని, నిర్మాతగా ఎస్ కె యెన్ ని ఈ చిత్రం వేరే లెవెల్ కి తీసుకెళ్లింది.

ఫుల్ రన్ లో ఈ సినిమా దాదాపుగా 40 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రాన్ని నిర్మించడానికి కనీసం రెండు కోట్ల రూపాయిలు కూడా ఖర్చు అయ్యుండదు. ఇప్పుడు ఇదే సినిమాని తమిళం లో రీమేక్ చెయ్యబోతున్నారు. అక్కడ శింబు కానీ ధనుష్ కానీ ఈ రీమేక్ లో నటించే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే శింబు డేట్స్ కోసం సంప్రదిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

268 views