Manchu Lakshmi: మనోజ్ భార్య మౌనికను టార్చర్ చేస్తున్న మంచు లక్ష్మి..కారణం ఇదే..

Posted by venditeravaartha, July 7, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

మంచు ఫ్యామిలీ గురించి కొన్ని రోజుల పాటు వార్తలు వినిపించడ లేదని అనుకుంటున్న తరుణంలో మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. నిత్యం ఏదో ఒక న్యూస్ వీరి గురించి నెట్టింట్లో హాట్ గా చర్చ సాగేది. గతంలో మంచు విష్ణు( Manchu vishnu ) ‘మా’ అధ్యక్షుడు అయినప్పటి నుంచి ఆయనతో పాటు మంచు ఫ్యామిలీని విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. తాజాగా మంచు లక్ష్మి చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ గా మారాయి. మంచు మనోజ్-మౌనిక ల సంసారం గురించి ఆమె మాట్లాడింది. అయితే కొందరు ఆమె మౌనికను తెగ టార్చెర్ చేస్తుందని అని అంటున్నారు. పెళ్లయి ఏడాది కాకముందే మౌనికను మంచు లక్ష్మి టార్చర్ చేయడానికి కారణమేంటి? అన్న ప్రశ్న ఎదురవుతుంది.

మంచు మనోజ్-మౌనికల రెండో పెళ్లి విషయంలో మంచు లక్ష్మీ ( Manchu Lakshmi ) బాధ్యత తీసుకున్నారు. వీరి పెళ్లిని దగ్గరుండి చేయించారు. రిసెప్షన్ కార్యక్రమాన్ని మంచు లక్ష్మి తన ఇంట్లో ఏర్పాటు చేసి అప్పట్లో వీడియో తీసి దానిని యూట్యూబ్ లో పెట్టడంతో అది వైరల్ గా మారింది. ఆ తరువాత మంచు మనోజ్ దంపతులను స్వయంగా దగ్గరుండి మరీ తిరుపతి దర్శనం చేయించారు. ఆ తరువాత వారి బాగోగులను ఎప్పటికప్పుడు తెలుసుకంటూ ఉంటున్నారు. ఇలా వారి విషయంలో కేర్ టేకర్ గా ఉన్న మంచు లక్ష్మి మౌనిక విషయంలో మాత్రం టార్చర్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అని అంటున్నారు. అయితే మౌనిక పెళ్లియిన తరువాత తమ సంసారంలోని ప్రతీ విషయాన్ని మంచు లక్ష్మితో షేర్ చేసుకుంటున్నారట. ఇంట్లో చేసే కొన్ని పనులకు ఎలాంటి డౌట్ ఉన్నా మంచు లక్ష్మికి ఫోన్ చేసి తీర్చుకుంటున్నారు.

ఇలా ప్రతీ దానికి ఫోన్ చేయడం వల్ల మంచు లక్ష్మి విసిగిపోయిందట. దీంతో ఓసారి కోపం తెచ్చుకొని ‘ప్రతీసారి ఎందుకు ఫోన్ చేస్తున్నావ్.. పెళ్లికి ముందు ఇలా ఫోన్ చేవావా? ’ అని గద్దెరించిందట. అయితే మౌని మాత్రం ఏమాట్లడేలకపోయిందట. ఆ తరువాత మంచు లక్ష్మీ ఓ చానెల్ తో మాట్లాడుతూ మౌనిక కు ఓపిక చాలా ఎక్కువ. ఎంత కోపగించుకున్నా.. తిరిగి మాట్లాడేస్తుంది. అందరిని కలపుకోవాలన్న తత్వం ఆమెది. అని చెప్పుకొచ్చింది. అయితే కొందరు వేరే అర్థం చేసుకొని మౌనికను మంచు లక్ష్మి టార్చర్ చేస్తోంది అంటూ పోస్టులు పెడుతున్నారు. ప్రతీ ఇంట్లో ఆడబిడ్డ వేధింపులు ఉంటాయి. కానీ మంచు వారి ఇంట్లో అప్పుడే మొదలయ్యాయా? అని చర్చించుకుంటున్నారు. మరి దీనిపై మంచు లక్స్మి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Tags :
2961 views