Chiranjeevi-Balakrishna: బాలకృష్ణ మీద పగతోనే చిరంజీవి ఆ సినిమా ఒప్పుకున్నాడా!

Posted by venditeravaartha, May 28, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ మొదటి జనరేషన్ హీరో లు అయినా ఎన్టీఆర్ ,నాగేశ్వర రావు ,కృష్ణ,శోభన్ బాబు కృష్ణం రాజు,మురళి మోహన్ మొదలగు వారు ఎక్కువ పౌరాణికం,ఫాంటసీ,ఫ్యామిలీ కథ చిత్రాలు వచ్చేవి..ఆ తర్వాత తరం హీరో లు అయినా చిరంజీవి,బాలకృష్ణ,నాగార్జున,వెంకటేష్ సుమన్ కాలం వచ్చే సరికి ఫ్యామిలీ సినిమాల తో పాటు ప్రేమ ,యాక్షన్ ల కు అధిక ప్రాధాన్యత ఇచ్చే వారు.1990 ల లో ఎక్కువ భాగం ఫ్యామిలీ సెంటిమెంట్ ప్రేమ సినిమా లే ఎక్కువ వచ్చాయి మరియు అవే సక్సెస్ కూడా అయ్యాయి.ఆ సమయం లో తెలుగు ఇండస్ట్రీ లో టాప్ ప్లేస్ కోసం చిరంజీవి ,బాలకృష్ణ మధ్య పోటీ తార స్థాయి లో ఉండేది .

gand leader

చిరంజీవి(Chiranjeevi) వరుసగా గ్యాంగ్ లీడర్,రౌడీ అల్లుడు ,ఘరానా మొగుడు ,ముఠా మేస్త్రి, ఉంది వంటి బ్లాక్ బస్టర్ సినిమా ల తో అటు క్లాస్ మరియు మాస్ ప్రేక్షలకులకి దగ్గర అయ్యి టాప్ ప్లేస్ లో ఉన్న సమయం లో బాలకృష్ణ(Balakrishna) తనకి లారీ డ్రైవర్ ,రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా లు ఇచ్చిన డైరెక్టర్ బి గోపాల్ తో ఒక ఫ్యాక్షన్ డ్రాప్ ఉన్న స్టోరీ తో 1999 జనవరి 13 న సమరసింహారెడ్డి సినిమా తో వచ్చారు..ఆ సినిమా బాలకృష్ణ కెరీర్ లోనే కాకుండా తెలుగు సినీ ఇండస్ట్రీ లో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. వీరి కలయిక లో రెండు సంవత్సరాల తరవాత 2001 జనవరి 11 న రిలీజ్ అయినా నరసింహనాయుడు తో మరో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు బాలకృష్ణ.

Balakrishna

అప్పటివరకు ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమా ల ను ఆదరించిన అభిమానులు ఒక్క సరిగా యాక్షన్ ఫ్యాక్షన్ వైపు మొగ్గుచూపడం తో బాలకృష్ణ అందించిన సమరసింహా రెడ్డి,నరసింహ నాయుడు సినిమా ల తో బాలయ్య చిరు కి గట్టి పోటీని ఇచ్చాడు.ఇక ఆ సమయం లో చిరు నుంచి వచ్చిన స్నేహం కోసం ,ఇద్దరు మిత్రులు ,మృగరాజు ,డాడీ సినిమా లు ఆశించిన స్థాయి లో ఆడకపోవడం తో చిరంజీవి కి ఏమి చేయాలో అర్ధం కాలేదు,ఒక పక్క బాలయ్య తనకి కలిసి వచ్చిన రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వరుసగా సినిమా లు చేసి సక్సెస్ అవుతుండటం తో చిరంజీవి కి రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఒక మూవీ తీయాలి అనే ఆలోచన వచ్చింది .ఫ్యాక్షన్ సినిమా కి కేర్ అఫ్ అడ్రస్ గా ఉన్న డైరెక్టర్ బి గోపాల్ ,రైటర్ చిన్ని కృష్ణ ని పిలిచి రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయాలనీ ఉంది దానికి కథ సెట్ చేయండి అని చెప్పడం తో చిన్ని కృష్ణ ,పరుచూరి బ్రదర్స్ కలిసి ఇంద్ర(Indra) సినిమా స్టోరీ ని రెడీ చేసారు.

Indra

ఇక ఈ సినిమా ని అప్పటికే రెండు ఇండస్ట్రీ హిట్లు కొట్టిన బి గోపాల్ గారు డైరెక్ట్ చేసాడు.కట్ చేస్తే 2002 జులై 24 న ఇంద్ర రిలీజ్ అయింది.చిరంజీవి ఫ్యాక్షన్ హీరో గా ఎలా చేస్తాడు,బాలయ్య కి పోటీ నా అసలు అంటూ మొదలైన వాదనలు ఇంద్ర మొదటి షో పడిన తర్వాత గల్లంతు అయిపోయాయి.తెలుగు సినీ ఇండస్ట్రీ లో అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డు ల ను బద్దలు కొట్టింది ఇంద్ర.పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్,మణిశర్మ మ్యూజిక్,చిరంజీవి గారి డాన్స్ ఇలా ప్రతి ఫ్రేమ్ కూడా ప్రేక్షకులని అలరించింది అని చెప్పాలి.సినిమా ల లో తన క్యారెక్టర్ ఇంద్రసేనా రెడ్డి అయినప్పటికీ క్యాస్ట్ ని సినిమా లో పేరు లో వద్దు అని ఇంద్ర అనే పెట్టారు.ఇక ఈ సినిమా తో చిరంజీవి గారికి తన నెంబర్ వన్ ప్లేస్ తిరిగి వచ్చింది..ఇప్పటికి అలానే ఉంది.

Indra song

729 views