Dhruva Sarjaa : స్మశానం లో భార్య కి సీమంతం చేసిన స్టార్ హీరో..అన్నయ్య మీద ఇంత ప్రేమనా!

Posted by venditeravaartha, September 21, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

సోషల్ మీడియా పుణ్యమాని ప్రపంచంలో ఏ చిన్న వార్తైనా క్షణాల్లో స్మార్ట్ ఫోన్లలో ప్రత్యక్షం అవుతుంది. యూట్యూబ్, ట్విటర్, ఫేస్ బుక్, వాట్సాప్ వచ్చిన తర్వాత జనాలు వాటికి బానిసలైపోయారు. చిన్న వార్త అయినా తనకు తెలిసిన వారితో షేర్ చేసుకుంటూ.. దానిని వైరల్ చేస్తున్నారు. వీరిలో సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలు వారింట్లో ఇంట్లో జరిగిన ఏ చిన్న వేడుకనైనా, విశేషమైనా సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇలా అభిమానులతో వారు పంచుకునే విషయాల్లో తొలి స్థానంలో పెళ్లిళ్లు, తర్వాత వారి కుటుంబానికి వారసుడు లేదా వారసురాలు వచ్చారన్న వార్తలే ఎక్కువగా వినిపిస్తుంటూ ఉంటాయి. తాజాగా అలాంటి వార్తనే యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు కన్నడ హీరో ధృవ సర్జా తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.

ఇటీవలే ఆయన తన భార్య సీమంతాన్ని తన సొంత అన్న స్వర్గీయ చిరంజీవి సర్జా సమాధి దగ్గర నిర్వహించారు. ఆ విషయం కాస్త సంచలనం అయి వార్తల ముఖ్యాంశాల్లో నిలిచింది. కాగా.. వినాయక చవితి పండగ రోజే తన భార్య ప్రేరణ శంకర్ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తానే స్వయంగా తన సోషల్ మీడియా యాప్ లో వెల్లడించాడు. ఆడబిడ్డ రాకతో ధృవ సర్జా ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. ధృవ సర్జా-ప్రేరణ శంకర్ దంపతులకు ఈ ఆడబిడ్డ రెండవ సంతానం. ప్రేరణ శంకర్ కు నార్మల్ డెలివరీ అయ్యిందని, మరోసారి ఆడబిడ్డ పుట్టిందని ధృవసర్జా తెలిపాడు. తన భార్య బిడ్డ ఆరోగ్యంతో ఉన్నారని పేర్కొన్నాడు.

దీంతో సినీ ప్రముఖులు, ఆయనను అభిమానించే వారు, నెటిజన్లు ఈ దంపతులకు బెస్ట్ విషెష్ చెబుతున్నారు. తన భార్య సీమంతం వేడుకను తన అన్న దివంగత చిరంజీవి సర్జా సమాధి వద్ద నిర్వహించి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజే ధృవసర్జా తన భార్యకు సీమంత వేడుక నిర్వహించాడు. అన్న ఆశీర్వాదాలు తన కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలనే తాను ఇక్కడ సీమంతం వేడుకను నిర్వహించినట్లు అతడు చెప్పుకొచ్చాడు. ధృవసర్జా పేరుకు కన్నడ హీరో అయిన పొగరు సినిమా తెలుగులో రిలీజైంది. ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయిన ఆయన నటనతో తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందాడు.

204 views