Deputy Cm Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పవన్ కళ్యాణ్ పనితీరు విమర్శించే వారిచేత కూడా ప్రశంసలు అందుకునేలా చేస్తుంది. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, పిలిస్తే పలుకుతా, మీ సమస్య పరిష్కరిస్తా అన్నట్టుగా ఆయన పాలన కొనసాగుతుంది. ఒక వ్యక్తికీ సమాజసేవ మీద ప్రేమ ఉంటూ, అతను రాజకీయాల్లోకి వచ్చి అధికార బాధ్యతలు చేపడితే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఇది వరకు కేవలం మనం సినిమాల్లో మాత్రమే చూసాము. నిజ జీవితం లో పవన్ కళ్యాణ్ ని మాత్రమే చూస్తున్నాము.
పవన్ కళ్యాణ్ కేవలం ఉప ముఖ్యమంత్రి మాత్రమే కాదు, పర్యావరణం, పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ, సైన్స్ & టెక్నాలజీ శాఖలకు మంత్రి కూడా. పర్యావరణ పరిరక్షణ లో భాగంగా పవన్ కళ్యాణ్ మరో అద్భుతమైన కార్యానికి శ్రీకారం చుట్టాడు. పర్యావరణం కి హాని కలిగించే కొనాకార్పస్ చెట్లను తొలగించి వాటి స్థానం లో ప్రాణవాయువు ని ఇచ్చే మొక్కలను నటించే కార్యక్రమం మొదలు పెట్టాడు. కాకినాడ జిల్లాతో పాటుగా, మిగిలిన అన్నీ జిల్లాల్లో కూడా నిన్న 35 వేల కోణాకార్పస్ చెట్లను అధికారుల చేత తొలగింపచేసాడు పవన్ కళ్యాణ్. ఒక్క కాకినాడ జిల్లాలోనే 4 వేల 5 వందల కోణాకార్పస్ చెట్లను తొలగించారట. ఇది కేవలం మొదటి దశ మాత్రమే. మరోపక్క పవన్ కళ్యాణ్ పర్యావరణ పరిరక్షణలో భాగంగా రోడ్డు మీద చెత్త లేకుండా చేస్తున్నాడు.
అంతే కాకుండా చెత్త నుండి సంవత్సరానికి రెండు వేల కోట్ల రూపాయిల విలువైన సంపదని ఉత్పత్తి చేసే కార్యక్రమం కి కూడా ఆయన ఈమధ్యనే శ్రీకారం చుట్టాడు. ఇలా తన శాఖల్లో రోజు ఎదో ఒక బలమెక్కిన మార్కుని చూపిస్తూ ముందుకు దూసుకుపోతున్న ఉపముఖ్యమంత్రి ఎదుగుదలని జీర్ణించుకోలేకపోతోంది ప్రతిపక్ష స్థానం కూడా దక్కించుకోలేకపోయిన వైసీపీ పార్టీ. విష వాయువుని ఇచ్చే చెట్లను పవన్ కళ్యాణ్ తొలగింపచేస్తుంటే, పర్యావరణ సంపద ని పవన్ కళ్యాణ్ నాశనం చేస్తున్నాడని, అకారణంగా 35 వేల చెట్లను నరికించేశాడని సోషల్ మీడియా ద్వారా అబద్దపు ప్రచారాలు చేస్తుంది.
ఇలాగే చేస్తూ పోతే ఈసారి 11 కాదు కదా, కనీసం ఒక్క స్థానం కూడా వచ్చే అవకాశం లేదని బల్లగుద్ది మరీ చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకసారి జనాలు నడ్డి విరిగేలా చితక్కొట్టి నువ్వు ప్రతిపక్ష స్థానానికి కూడా పనికిరావు అని జనాలు మూలాన కూర్చోబెడితే, జరిగిన తప్పులను సమీక్షించి పార్టీ ని బలోపేతం చెయ్యడం మాని, జగన్ తన సమయాన్ని మొత్తం విష ప్రచారాలకు మాత్రమే ఉపయోగిస్తున్నాడని సోషల్ మీడియా లో జగన్ ని అభిమానించే వారు బాధపడుతున్నారు.