Kalki 2898 AD: ‘కల్కి’ లో నటించినందుకు ప్రభాస్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న దీపికా పదుకొనే..!

Posted by venditeravaartha, July 4, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Deepika Padukone: రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కల్కి’ ఇటీవలే విడుదలై భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. మహాభారతం బ్యాక్ డ్రాప్ ని సైన్స్ ఫిక్షన్ ని జోడించి హాలీవుడ్ తరహాలో తెరకెక్కించిన ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కేవలం తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు, ఈ సినిమాకి హిందీ, తమిళం, మలయాళం, కన్నడ బాషా ప్రేక్షకులు కూడా ఈ చిత్రానికి క్యూలు కడుతున్నారు. బుక్ మై షో లో ఇప్పటికీ ఈ సినిమాకి గంటకి 20 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి అంటే ఈ చిత్రం ఏ స్థాయిలో ఆడుతుందో అర్థం చేసుకోవచ్చు.

ఇప్పటికే 700 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టిన ఈ చిత్రం , ఈ వీకెండ్ తో వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా హీరోయిన్ గా చేసిన దీపికా పదుకొనే గురించి మాట్లాడుకోవాలి. ఈమె బాలీవుడ్ లో స్టార్ హీరోలతో సరిసమానమైన సూపర్ స్టార్ అనే విషయం మన అందరికీ తెలిసిందే. కేవలం ఈమెని చూసి థియేటర్స్ కి క్యూలు కట్టే ప్రేక్షకుల సంఖ్య కోట్లలో ఉంటుంది. ఆమె నటించిన ఎన్నో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సునామి ని సృష్టించాయి.

అందుకే ఆమెకి పారితోషికం కూడా దర్శక నిర్మాతలు అదే స్థాయిలో ఇస్తుంటారు. ఇప్పుడు కల్కి సినిమాలో ఆమె నటించినందుకు గాను దాదాపుగా 30 కోట్ల రూపాయిలు ఇచ్చారట. 30 కోట్ల రూపాయిలు రెబెల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాకి తీసుకున్నాడు అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఒక హీరోయిన్ ఈ స్థాయి రెమ్యూనరేషన్ తీసుకోవడం చరిత్రలో ఇదే తొలిసారి అని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఆమె ఆ స్థాయిలో డిమాండ్ చేస్తుంది కాబట్టే, అంత క్రేజ్ ఉన్నప్పటికీ కూడా బడ్జెట్ పరిమితులను దృష్టిలో పెట్టుకొని దర్శక నిర్మాతలు ఆమెని తమ సినిమాల్లోకి తీసుకునేందుకు భయపడుతూ ఉంటారు. కేవలం బాలీవుడ్ కి మాత్రమే పరిమితం కాకుండా, హాలీవుడ్ లో కూడా దీపికా పదుకొనే కి అవకాశాలు వెల్లువలాగా వస్తూనే ఉన్నాయి.

245 views