DASARA:దసరా మూవీ రివ్యూ ఎక్సక్లూసివ్ గా మీ కోసం

Posted by venditeravaartha, March 30, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

న్యాచురల్ స్టార్ నాని అభిమానులు ,సగటు సినిమా ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నచిత్రం ‘దసరా ‘,ఎట్టకేలకు ఈ రోజు శ్రీరామనవమి పండుగ పర్వదినా ప్రపంచ వ్యాప్తముగా రిలీజ్ అయింది.నాని కెరీర్ లో ఇది హైయెస్ట్ బడ్జెట్ చిత్రం ,మరియు తన మొదటి పాన్ ఇండియన్ సినిమా.ఈ సినిమా ద్వారా ‘శ్రీకాంత్ ఓదెల’ డైరెక్టర్ గా పరిచయం అయ్యారు.నేను లోకల్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నాని ,కీర్తి సురేష్ కలిసి నటించారు , ప్రముఖ సంగీత దర్శకులు ‘సంతోష్ నారాయణ్ ‘ మ్యూజిక్ అందించారు.

దసరా సినిమా కథ విషయానికి వస్తే ‘ధరణి(నాని), వెన్నెల(కీర్తి సురేష్),సూరి(దీక్షిత్ శెట్టి) చిన్నపటి నుంచి మంచి స్నేహితులు.వీర్లపల్లి అనే ఒక పల్లెటూరు లో జీవిస్తూ ఉంటారు.ఆ ఊరు లో మద్యం తాగడం అనేది ఒక అలవాటు కంటే కూడా ఒక సంప్రదాయం గా ఉంటుంది.అక్కడ ఊర్లో ఉన్న ‘సిల్క్ స్మిత’ బార్ లో అందరు తాగుతూ ఉంటారు ,అయితే అక్కడ అందరికి ఎంట్రీ ఉండదు ,దానికోసం బార్ బయట గొడవలు జరుగుతూ ఉంటాయి.ధరణి ,సూరి ఇద్దరు ఆ ఊరి బయట వెళ్తున్న ట్రైన్ ల నుంచి బొగ్గు ని దొంగలించి డబ్బులు సంపాదిస్తుంటారు.అయితే అక్కడ లోకల్ రాజకీయ నాయకులు ‘రాజన్న'(సాయికుమార్),శివన్న(సముథిరాకని) ,చిన్ననంబి(షైన్ టామ్ చిక్కుకో) లు కలయిక తో ధరణి ,సూరి జీవితాల తో ఎలా మలుపు తిరిగాయి అనేది కథాంశం.

ఫస్ట్ హాఫ్ లో ఒక్కొక్కరి క్యారెక్టర్ ల ను పరిచయం చేసే విధానం , ఆ పాత్రలు చేసే అభినయం చాల చక్కగా చూపించారు దర్శకుడు,మొదటి సినిమా అనే ఫీల్ ఎక్కడ కూడా అనిపించదు,
నాని ,కీర్తి సురేష్ ల మధ్య వచ్చే లవ్ ట్రాక్ చాల బాగా వర్క్ అవుట్ అయింది,చమ్కీలఆంగిల్స్ సాంగ్ సూపర్ గా చూపించారు,ఇక ఇంటర్వెల్ సీన్ అయితే దసరా కి ముందు ,దసరా తరవాత అన్నట్టు ఉంటుంది,ముఖ్యం గా సంతోష్ నారాయణ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్దిరిపోయింది.


నాని ,కీర్తి లు తమ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఫస్ట్ హాఫ్ లో మొదలైన వారి ప్రేమ ,సెకండ్ హాఫ్ కి ప్రేమ ని మిచే స్థాయి కి వెల్తుంది.ఇంటర్వెల్ కి సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతోందో అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరి లో తీసుకుని వచ్చారు దర్శకుడు శ్రీకాంత్.
ప్లస్ :నాని ,కీర్తి సురేష్ ,సంగీతం,డైరెక్షన్,ఇంటర్వెల్ ,క్లైమాక్స్.
మైనస్:కొన్ని బోరింగ్ సీన్లు, ఊహలకు అనుగుణంగా సాగే కథనం, స్లో నారేషన్.
చివరిగా ‘దసరా’ నాని కెరీర్ బెస్ట్ మూవీ.
రేటింగ్ :4 / 5

1820 views