Janasena Party: మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ లో పరకాల ప్రభాకర్ ని అంత తేలికగా ఎవరైనా మర్చిపోగలరా.. మొదటి నుండి చిరంజీవి కి తోడుగా ఉంటూ, సరిగ్గా ఎన్నికల సమయం లో ప్రజారాజ్యం పార్టీ ఆఫీస్ లోనే ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి చిరంజీవి పై, ప్రజారాజ్యం పార్టీ పై ఇష్టమొచ్చిన కామెంట్లు చేసి వెళ్లిపోయారు. పరకాల ప్రభాకర్ అంటే అప్పుడే వచ్చాడు, సంవత్సరం లోపే వెళ్ళిపోయాడు అనుకుందాం. కానీ జనసేన పార్టీ లో ఏళ్ళ తరబడి పవన్ కళ్యాణ్ పేరు ని చెప్పుకొని ఫేమ్ ని సంపాదించిన అనేక మంది కష్ట సమయంలో ముసుగు తీసి ఒక్కొక్కరిగా వెళ్లిపోతున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన పోతిన మహేష్ ఉందంతం పవన్ కళ్యాణ్ అభిమానులకు, జనసేన పార్టీ శ్రేణులకు కోలుకోలేని షాక్ అనే చెప్పాలి.
జనసేన పార్టీ కాకుండా, మరో జెండా పట్టుకొని తిరిగితే జనసేన కార్యకర్తలు ఎవరైనా సరే కొబ్బరి బొండాం కత్తి తో విజయవాడ లో నా చెయ్యి నరికేయొచ్చు వంటి వ్యాఖ్యలు చేసిన పోతిన మహేష్, టికెట్ రాకపోయేసరికి కేవలం రెండు మూడు వారాల్లోనే వైసీపీ పార్టీ లో చేరి పవన్ కళ్యాణ్ ని అతి దారుణంగా తిట్టడమే ద్యేయంగా పెట్టుకున్నారు. రెండు వారల క్రితం దేవుడైన మనిషి, అకస్మాత్తుగా దెయ్యం ఎలా అయిపోయాడు అనేది రాజకీయ విశ్లేషకులకు సైతం అంతు చిక్కని ప్రశ్న. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే పోతిన మహేష్ అనే వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు తెలిసేవాడా?, కష్టపడి పని చేసినందుకు 2019 ఎన్నికలలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి, అతనికి జిల్లా అద్యక్ష్యుడి హోదా ఇచ్చి, పవన్ కళ్యాణ్ ఈ బీసీ నాయకుడికి సమాజం లో ఒక గౌరవం సముచిత స్థానం కల్పించాడు. కానీ ఇప్పుడు వైసీపీ లోకి వెళ్లిన డబ్బులకు కక్కుర్తి పడి వెళ్లి సాధించినది ఏమిటి?, ఎమ్మెల్యే స్థాయి నుండి జెండా మోసే కూలి స్థాయికి దిగజారిపోయాడు.
ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన మరో కోవర్టు వ్యక్తి కళ్యాణ్ దిలీప్ సుంకర. అద్భుతమైన వాక్చాతుర్యంతో సోషల్ మీడియా మాధ్యమం ద్వారా జనసేన పార్టీ కి గొంతుకగా నిలిచి తనకి తోచిన సేవలు అందించాడు. అయితే సోషల్ మీడియా లో ఇతని మీద ఉన్న కొన్ని ప్రచారాల కారణంగా పార్టీ అతనిని గత కొంతకాలంగా దూరంగా పెడుతూ వచ్చింది. తెలుగు దేశం పార్టీ తో పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేదు అని ఇప్పుడు ఆయన మాట్లాడడం హాస్యాస్పదం గా ఉంది. పొత్తు ప్రకటించిన రోజు మద్దతు తెలిపి, సరిగ్గా ఎన్నికల సమయానికి ప్లేట్ ఫిరాయించడం, పవన్ కళ్యాణ్ ప్యాకేజి తీసుకున్నాడు అంటూ ఆరోపణలు చెయ్యడం వెన్నుపోటు చర్యగానే భావించవచ్చు.
వివిధ అంశాల మీద మాట్లాడే కళ్యాణ్ దిలీప్ సుంకర, గత కొద్దీ రోజులుగా నేను తటస్తుడిని అనే ముసుగులో సీఎం జగన్ కి మద్దతుగా వీడియోలు చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అతనికి పవన్ కళ్యాణ్ ఇప్పుడు నచ్చక పార్టీ వదిలి వెళ్లిపోవచ్చు గాక, అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ ఇన్ని రోజులు ఎవరి పేరు అయితే వాడుకొని జనాదరణ దక్కించుకున్నావో, అతని మీద అసత్య ఆరోపణలు చెయ్యడం దుర్మార్గపు చర్యగా భావించవచ్చు. జనసేన లో ఇలాంటి పరకాల ప్రభాకర్లు చాలా మందే ఉన్నారని టాక్. పవన్ కళ్యాణ్ పక్కనే ఉంటూ సలహాలు ఇచ్చే ఒక పెద్ద మనిషి ఎన్నికలు పూర్తి అయినా వెంటనే టీడీపీ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నాడని రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ. మరి ఆ వ్యక్తి ఎవరో చూడాలి.