Suthivelu: కమెడియన్ సుత్తివేలు గుర్తున్నాడా..? ఆయన ఇద్దరు కూతుర్లు ఇప్పుడు ఎలా ఉన్నారో చూస్తే కన్నీళ్లు ఆపుకోలేరు!

Posted by venditeravaartha, July 28, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Suthivelu: మన టాలీవుడ్ లో లెజండరీ నటీనటులకు కొదవే లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే మన ఇండస్ట్రీ లో ఉన్నటువంటి నటీనటులు ఏ ఇండస్ట్రీ లో కూడా లేరు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. హీరోలు, క్యారక్టర్ ఆర్టిస్టులు, గాయని గాయకులూ, దర్శకులు, నిర్మాతలు, కమెడియన్లు ఇలా చెప్పుకుంటే పోతే రోజులు గడిచిపోతాది. అలాంటి సుదీర్ఘ చరిత్ర ఉన్న ఇండస్ట్రీ మనది. ఈ ఇండస్ట్రీ లో లెజండరీ కమెడియన్ గా ప్రేక్షకులు చిరాస్తాయిగా, తరతరాలు గుర్తించుకోదగిన స్థానాన్ని సంపాదించిన వారిలో ఒకరు సుత్తివేలు.

కామెడీ అయినా, భావోద్వేగపూరిత సన్నివేశాల్లో అయినా సుత్తివేలు అద్భుతంగా పండించగలరు. సుత్తివేలు అసలు పేరు కురుమద్దాలి లక్ష్మి నరసింహా రావు. ఈయన తండ్రి వృత్తి రీత్యా ఉపాద్యాయుడు అయ్యినప్పటికీ రంగస్థల నాటకాలు అంటే పిచ్చి. ఆరోజుల్లో ఆయన తండ్రి ఉపాధ్యాయుడిగా కొనసాగే సమయంలో ఒక్కోసారి ఆరు నెలల పాటు జీతాలు రాని సందర్భాలు ఉన్నాయట. అలాంటి సమయం లో నాటకాలే వారి కుటుంబాన్ని పెంచి పోషించిందని సుత్తివేలు ఒక ఇంటర్వ్యూ లో తెలిపాడు. అలా తండ్రి నుండి వారసత్వం గా సుత్తివేలు కి రంగస్థల నాటకాలు మీద మక్కువ నెలకొంది. అలా సుత్తివేలు కూడా ఎన్నో వందల నాటకాలు వేసేవాడు సినిమాల్లోకి వచ్చే ముందు. అలా ఈయన ప్రముఖ లెజండరీ డైరెక్టర్ జంధ్యాల దృష్టిలో పడ్డాడు.

ఆయన తెరకెక్కించిన ‘ముద్ద మందారం’ చిత్రం ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు. ఈ సినిమాలో ఆయన పోషించిన పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఆ తర్వాత జంధ్యాల తీసే ప్రతీ సినిమాలోనూ సుత్తివేలు కి ప్రత్యేకంగా ఒక క్యారక్టర్ రాసేవాడు. అలా మొదలైన ఆయన కెరీర్ సుమారుగా 500 కు పైగా సినిమాల్లో నటించే అవకాశం కల్గింది. ఈయన చివరిసారి వెండితెర మీద కనిపించిన చిత్రం ‘రామాచారి’. ఈ చిత్రం 2013 వ సంవత్సరం లో విడుదలైంది. ఈ సినిమా విడుదలకు ముందు అనగా 2011 వ సంవత్సరంలోనే సుత్తివేలు గుండెపోటుతో మరణించాడు. ఈయన భార్య పేరు లక్ష్మి రాజ్యం. ఈ దంపతులిద్దరికీ ముగ్గురు కూతుర్లు, ఒక కొడుకు సంతానం ఉన్నారు. వీళ్లంతా ప్రస్తుతం చెన్నై లో ఉన్నారు. చివరి శ్వాస వరకు తన సొంత కష్టార్జీతంతో బ్రతకాలని కోరుకున్న సుత్తివేలు, తన చివరి రోజుల్లో సినిమాల్లో అవకాశాల కోసం హైదరాబాద్ కి మకాం మార్చాల్సి వచ్చింది. కానీ పెద్దగా అవకాశాలు రాలేదు.

ఇకపోతే సుత్తివేలు ముగ్గురు కూతుర్లకు పెళ్లి అయిపోయింది. వీళ్లంతా మాములు వ్యక్తులు లాగానే చాలా సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నారు. ఇక కొడుకు ఒక చిన్న వ్యాపారంతో నెట్టుకొస్తున్నదని తెలిసింది. ఇండస్ట్రీ కి చెందిన ఒక లెజెండ్ కమెడియన్ కుటుంబం ఇలా మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారిలాగా బ్రతుకుతున్నారు అంటే చాలా బాధేస్తుంది కదూ. సినిమా అనేది రంగుల ప్రపంచం, ఇక్కడ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది అనుకుంటే ఒక భ్రమ లాంటిది అని చెప్పడానికి సుత్తివేలు కుటుంబం ఒక ఉదాహరణ.

Tags :
612 views