Cinema: దేశ వ్యాప్తముగా మూతపడనున్న మల్టీప్లెక్స్ స్క్రీన్ లు!

Posted by venditeravaartha, May 17, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ఇండియా లో ఎంటర్టైన్మెంట్ అంటే రెండే ఉంటాయి అందులో ఒకటి సినిమా మరొకటి క్రికెట్ అయితే సినిమా ల కి ఉన్న క్రేజ్ వేరు ఒకప్పుడు పేద వాడి సొంతషం ఏంటి అంటే వీకెండ్ సినిమా అనే వారు..అయితే పోను పోను సినిమా ల మీద ఇంట్రస్ట్ పోతు వస్తుంది ,దానికి కారణాలు ఎన్ని ఉన్నపటికీ ముఖ్యం గా పెరుగుతున్న టికెట్ రేట్ లు వలన థియేటర్ కి వెళ్లే వారి సంఖ్య రోజు రోజు కి తగ్గుతుంది ఇదే సమయం లో ఇంటర్నెట్ ,డిజిటల్ మీడియా లు అందుబాటు లో ఉండటం తో థియేటర్ ల లో సినిమా ఎక్కువ రోజులు ఆడే పరిస్థితి లేదు ఇప్పటికే ఇండియా లో ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్ లు చాల వరకు మూతపడ్డాయి ఇప్పుడు దీని ప్రభావం మల్టీప్లెక్సుల(Multiplex) మీద పడనుంది.

ముల్టీప్లెక్సు ల లో దిగ్గజ సంస్థ అయినా PVR ఇప్పుడు తమ థియేటర్ ల మీద కీలక నిర్ణయం తీసుకుంది. తీవ్ర నష్టాల్లోకి కూరుకుపోయిన PVR సంస్థ దేశవ్యాప్తంగా కొన్ని వందల స్క్రీన్ ల ను కలిగి ఉంది.ఇండియా లో ఉన్న ప్రతి సిటీ ల లో ఉన్న షాపింగ్ మాల్స్ ల లో PVR స్క్రీన్ లు తప్పకుండా ఉంటాయి.ఇప్పుడు ఎదుర్కుంటున్న నష్టాల వలన అందులో దాదాపు 50 స్క్రీన్ ల ను మూసివేయాలని నిర్ణయించింది. ఈ సంవత్సరం లో ఇప్పటి వరకు పీవీఆర్‌- ఐనాక్స్‌కు దాదాపు రూ. 350 కోట్ల నష్టం వచ్చింది.థియేటర్ల నిర్వహణ ఖర్చులు పెరగడం, అందుకు తగ్గట్టుగా ఆదాయం లేకపోవడం, బాలివుడ్‌ సినిమాలు బాక్సాఫీస్‌ దగ్గర చతికిలపడటంతో సంస్థ నష్టాలను చవిచూసింది.

అయితే PVR సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో 200 స్క్రీన్‌లను ఓపెన్‌ చేయాలని భావించింది. కొన్ని ఏరియా ల లో ఇప్పటికే 9 స్క్రీన్ ల ను ఏర్పాటు చేసారు ,మరో 15 స్క్రీన్ ల ను ఏర్పాటు చేసే పని లో ఉన్నారు. మిగిలిన స్క్రీన్ ల ను కూడా ఈ సంవత్సరం లోపు పూర్తి చేసే పని లో ఉన్నారట.అయితే గత సంవత్సరం నుంచి బాలీవుడ్ సినిమా చతికల పడటం ,ఇంగ్లీష్ సినిమా లు సరిగా ఆడకపోవడం వలెనే PVR సంస్థలకు భారీ నష్టాలు వచ్చాయి అని అంటున్నారు,ఇండియా లోనే అతి పెద్ద మల్టీప్లెక్స్ లు కలిగి ఉన్న PVR భారత్ తో పాటు శ్రీలంక తో కలిపి 1689 స్క్రీన్ ల ను కలిగి ఉన్నారు..మరి ప్రెసెంట్ ఉన్న నష్టాలను నుంచి బయట పడటానికి స్క్రీన్ ల ను మూసివేయడం తప్పితే మరో మార్గం లేకపోవడం తో ఈ నిర్ణయం తీసుకున్నాం అని తెలియాచేసారు.

2109 views