CHIRU-PAWAN:పవన్ కళ్యాణ్ ఏమి అంత గొప్ప నటుడు కాదు ,డాన్సర్ అంతకంటే కాదు ! చిరంజీవి సంచలన వ్యాఖ్యలు..

Posted by venditeravaartha, April 27, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరో ల లో మెగా స్టార్ చిరంజీవి మొదటి స్థానం లో ఉంటారు , 40 సంవత్సరాల నుంచి టాలీవుడ్ ని రూల్ చేసిన మెగాస్టార్ చిరంజీవి గారు రాజకీయాల వలన 9 సంవత్సరాలు సినిమా ల కి దూరం గా ఉన్నపటికీ అయన స్థానం అలానే ఉంది అని చిరంజీవి గారి రీ ఎంట్రీ తర్వాత నిరూపించాడు,చిరంజీవి గారి తర్వాత ఆ స్థాయి స్టార్ డాం ,ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరో పవన్ కళ్యాణ్ గారు,ఇంద్ర 175 డేస్ ఫంక్షన్ అప్పుడే పవన్ కళ్యాణ్ గారి ఫాలోయింగ్ ఏ స్థాయి లో ఉండేదో తెలుస్తుంది.అలాంటి స్థాయి కలిగి ఉన్న తన తమ్ముడి గురించి చిరంజీవి గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

ఇటీవల ఒక మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ గురించి అడిగిన క్వశ్చన్ కి సమాధానం ఇస్తూ ,పవన్ కళ్యాణ్ కి అసలు యాక్టింగ్ మీద ఇంట్రస్ట్ లేదు ,వాళ్ళ వదిన సురేఖ ,మా అమ్మ వారు తన ని ఫోర్స్ చేసి సినిమా లో కి వెళ్లే లాగా చేసారు.అయితే తాను ఎలా ఈ ఇండస్ట్రీ లో నెట్టుకుని వస్తాడా అని నాకు డౌట్ ఉండేది,చిరంజీవి తమ్ముడి గా అవకాశం వచ్చిన , ఆ అవకాశాలని ఎలా సద్వినియోగ పరుచుకుంటాడా అని కంగారు గా ఉండే వాడిని ,దానికి కారణం ‘కళ్యాణ్ నాలాగా డాన్స్ లు చేయడు,ఎమోషనల్ గా నటించ లేడు,పెద్ద నటుడు గా కూడా కాదు’,అయినా కూడా తనకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంత ఇంత కాదు.

పవన్ కళ్యాణ్ కి కేవలం సినిమా ల ద్వారా మాత్రమే వచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే కాదు ,తన వ్యక్తిత్వం ద్వారా వచ్చిన ఫాన్స్ తనకి వరుసగా ప్లాప్ లు వచ్చిన తన వెంటనే ఉన్నారు,అందువల్లనే తాను రాజకీయ ల లోకి వెళ్లిన కూడా ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంచ్ కూడా తగ్గలేదు,ఇక తగ్గదు కూడా. అలాంటి వ్యక్తి గురించి కొంత మంది చేసే విమర్శల గురించి పట్టించుకోవాల్సిన పని లేదు అని అన్నారు.అయితే కళ్యాణ్ గురించి చిరంజీవి గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాగా వైరల్ అయ్యాయి.

683 views